Kannappa Official Telugu Teaser 2: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మైథలాజికల్ డ్రామాగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతుంది. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలతో పాటు ప్రమోషన్స్‌ని కూడా మొదలు పెట్టారు. ఇందులో భాగంగా మూవీ నుంచి మెల్లిమెల్లిగా అప్‌డేట్ ఇస్తున్నారు. ఇప్పటి ఫస్ట్ సింగిల్ పేరుతో శివ శిశ పాట రిలీజ్ చేయగా.. దానికి విశేష స్పందన వచ్చింది. శివరాత్రి రోజుల ఆ పాట్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్ .
టీజర్ విషయానికి వస్తే
ఇందులో మంచు విష్ణు ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించాడు. మొదటి నుంచి కన్నప్పను విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నట్టు ప్రమోషన్స్‌లో విష్ణు చెప్పుకొస్తూనే ఉన్నాడు. అన్నట్టుగానే తాజాగా రిలీజైన టీజర్ విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఇక ఇందులో విష్ణు ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించాడు. టీజర్ లో డైలాగులు, దుమ్ము రేపే యాక్షన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. తిన్నడుగా తన శత్రువర్గంపై విరోజితంగా పోరాడు. ముఖ్యంగా విష్ణు డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. దుమ్మురేపే యాక్షన్‌కి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.
మొత్తానికి విజువల్ ట్రీట్‌గా ఈ టీజర్ ఆకట్టుకుటుంది. మహాకవి ధూర్జటి రాసిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్ర స్ఫూర్తితో కన్నప్పను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల వంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు.