Site icon Prime9

Kannappa Movie New Release date: కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన విష్ణు..

kannappa new release date

kannappa new release date

Manchu Vishnu’s Kannappa Movie Releasing on April 25th: మంచు కుటుంబంలో ఆస్తి తగాదాలు మరోసారి బయటపడ్డాయి. మంచు మనోజ్ ను ఒంటరిని చేసి.. విష్ణు, మోహన్ బాబు అతడిపై కక్ష సాధిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాను  ఊర్లో లేనప్పుడు అతని ఇంటికి వెళ్లి.. విలువైన వస్తువులను, కార్లను విష్ణు దొంగతనం చేసాడని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి మోహన్ బాబుతో మాట్లాడి ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటే.. అయన మాట్లాడడానికి సహకరించడం లేదని చెప్పుకొచ్చాడు.

 

నేటి ఉదయం మోహన్ బాబు ఇంటివద్ద  మనోజ్ నిరసనకు దిగిన విషయం తెల్సిందే. విష్ణు తనను వాడుకున్నాడని, అతడి ఎదుగుదలకు తానెంతో కష్టపడినట్లు మనోజ్ చెప్పుకొచ్చాడు.  ఇక ఇవేమి పట్టించుకోని విష్ణు.. తన సినిమా కన్నప్ప ప్రమోషన్స్ తో బిజీగా మారటం చర్చనీయాంశం అయ్యింది.

 

మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం కన్నప్ప. మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విష్ణు.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ ని దింపాడు. ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్.. ఇలా స్టార్స్ మొత్తాన్ని గెస్ట్ రోల్స్ ల దింపేశాడు.

 

మిగతావారందరి గురించి పక్కన పెడితే ప్రభాస్ ఉన్నాడన్న ఒకే ఒక కారణంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అన్ని బావుంటే ఈ నెల 25 న  కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కొన్ని కారణాల వలన కన్నప్ప అనుకున్న సమయానికి రాలేకపోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ కారణం ఏంటి అనేది నేడు  మనోజ్  బయటపెట్టాడు. తన సినిమాకు భయపడి కన్నప్పను వాయిదా వేశారని.. తాను నటించిన భైరవం ఈ నెలలోనే రిలీజ్ ఉందని.. అందుకే తమ సినిమాను వాయిదా వేసుకున్నారని మనోజ్ చెప్పుకొచ్చాడు.

 

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించాడు విష్ణు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసి, ఆయనతో కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేయించారు మోహన్ బాబు, విష్ణు. జూన్ 27 న కన్నప్ప రిలీజ్ అవుతుందని తెలుపుతూ మంచు విష్ణు ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు.  తమ్ముడి గొడవతో  అటెన్షన్ గ్రాబ్ చేసిన విష్ణు.. ఇదే సరైన టైమ్ అనుకోని ఈ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో  మంచు విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

 

 

Exit mobile version
Skip to toolbar