Site icon Prime9

Manchu Family: మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఘర్షణలు.. కొట్టుకొని కేసులు పెట్టుకున్న తండ్రీకొడుకులు!.. ఖండించిన పీఆర్ టీమ్

Manchu Manoj and Mohan Babu File Police Complaints Against Each Other: మంచు ఫ్యామిలీలో చోటుచేసుకున్న విబేధాలు బయటకు వచ్చాయి. తండ్రీకొడుకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంచు మనోజ్‌తో పాటు మోహన్ బాబు ఇద్దరూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారని వార్తలు వస్తున్నాయి. తనపై దాడికి చేశారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేయగా.. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ప్రధానంగా పాఠశాల, ఆస్తుల వ్యవహారంలోనే ఘర్షణలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య చోటుచేసుకున్న వివాదంపై మంచు ఫ్యామిలీ ఇంకా స్పందించలేదు. కానీ మోహన్ బాబు పీఆర్ టీమ్ ఖండించింది. మంచు మనోజ్ గాయాలతో పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆస్తి వ్యవహారంలో తండ్రీకొడుకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version