Site icon Prime9

Mammootty : రెండు దేశాలలో బ్యాన్ చేసిన మమ్ముట్టి కొత్త సినిమా .. కారణం ఇదే

mammotty and jyothka starring kaathal the core movie banned in qatar and kuwait

mammotty and jyothka starring kaathal the core movie banned in qatar and kuwait

Mammootty  : మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొత్త సినిమాని కువైట్,ఖతర్ వంటి రెండు దేశాల్లో బ్యాన్ చేశారు . ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంతకీ మమ్ముట్టి కొత్త సినిమా రెండు దేశాల్లో మాత్రమే ఎందుకు బ్యాన్ అయింది? అనే వివరాల్లోకెళ్తే.. హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా మలయాళం లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు మమ్ముట్టి. ఇప్పటికీ కూడ యువ హీరోలకు దీటుగా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఆయన నటించిన ‘కన్నూర్ స్క్వాడ్’ థియేటర్స్ లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.కేరళలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వందకోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మమ్ముట్టి ప్రస్తుతం రెండు బడా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టారు. అందులో ఒకటే ‘కాదల్ ది కోర్’ మూవీ. ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ మూవీ ని తెరకెక్కించిన జో బేబీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా స్వయంగా మమ్ముట్టి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జ్యోతిక ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 23న థియేటర్స్ లో రిలీజ్ కు సిద్ధమైంది. ఇలాంటి తరుణంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ కు కువైట్,ఖతర్ వంటి దేశాల్లో బ్రేక్ పడింది . సినిమాలో ఉన్న అడల్ట్ కంటెంట్ వల్లే ఈ మూవీ రిలీజ్ ని కువైట్, ఖతర్ దేశాల్లో బ్యాన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మమ్ముట్టి హోమోసెక్సువల్ గే పాత్రలో నటించారని, అందుకే అక్కడ సెన్సార్ అభ్యంతరం చెప్పిందని అంటున్నారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా స్టోరీ ప్రకారం చూస్తే ..

మమ్ముట్టి ఓ రిటైర్డ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అఫీషియల్ గా పనిచేస్తాడు. అయితే పంచాయతీ ఎలక్షన్లో నిలబడదాం అనుకుంటే అతని రాజకీయ లక్ష్యాలు, సెక్సువల్ ఓరియంటేషన్స్ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో అతని భార్య(జ్యోతిక) విడాకులకు అప్లై చేస్తుంది. అక్కడినుంచి కథ చాలా కాంప్లెక్స్ గా జరుగుతుంది. సినిమాలో హోమోసెక్సువల్ కంటెంట్ ఉండడంతో కువైట్ సెన్సార్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది కాస్త సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మమ్ముట్టి కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రంలో లలూ అలెక్స్, ముతుమని, చిన్ను చాందిని, జోషి సాజో, ఆదర్శ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషించగా సాలుకే థామస్ సినిమాటోగ్రఫీ అందించారు.

 

Exit mobile version