Prime9

OG Release Date Fixed: సర్‌ప్రైజ్‌.. ‘ఓజీ’ రిలీజ్‌ డేట్‌ కూడా వచ్చేసిందోచ్‌.. ఆఫీషియల్‌ డేట్‌ చెప్పేసిన మేకర్స్‌

Pawan Kalyan’s OG movie Releasing on September 25th: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కి డబుల్‌ ధమాకా అనే చెప్పాలి. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక.. పవన్‌ను వెండితెరపై చూసే అవకాశం ఉంటుందా? అనే సందేహించారు. ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్స్‌ ఉన్నా.. వాటి షూటింగ్‌ జరుగుతుందా? అనే డైలామా పరిస్థితి వచ్చింది. కానీ, పవన్‌ మాత్రం డిప్యూటీ సీఎం తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. తనని నమ్మిన దర్శక-నిర్మాతలకు ఎలాంటి నష్టం లేకుండ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.

 

ఇటూ డిప్యూటీ సీఎంగా.. అటూ నటుడిగా రెండు బాధ్యతలను తూ.చ పాటించారు. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్‌ పూర్తి చేసి.. సినిమాను రిలీజ్‌కు ఇచ్చేశారు. తాజాగా ఓజీ సెట్లోని పాల్గొని షూటింగ్‌ని ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓజీ మేకర్స్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామంటూ తాజాగా సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం. కాగా జూన్‌ 12న హరి హర వీరమల్లు రిలీజ్‌కు సిద్ధమౌవుతోంది. ఇక మరో మూడు నెలల్లో అంటూ సెప్టెంబర్‌ 25న ఓజీ కూడా థియేటర్లోకి రాబోతోంది.

 

ఇలా బ్యాక్‌ టూ బ్యాక్‌ హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలు థియేటర్లో సందడి చేయబోతుండటంతో పవన ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పాలి. ఇక థియేటర్ల పవర్‌ స్టార్‌ మేనియా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అంచనాలకు కూడా అందని పరిస్థితి. కాగా సాహో డైరెక్టర్‌ సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.  ఇందులో పవన్‌ కళ్యాణ్‌ సరసన ప్రియాంక మోహన్‌ అరూళ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ముంబైకి చెందిన ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీతోనే ఆయన టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడు.

 

ఇందులో నటి శ్రీయా రెడ్డి కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు త్వరలోనే పవన్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా షూటింగ్‌ కూడా మొదలు కానుంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటి వరకు పది నుంచి ఇరవై శాతం వరకు షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇక ఓజీ మూవీ షూటింగ్‌ పూర్తయిన వెంటనే పవన్‌ పూర్తి స్థాయిలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కోసం డేట్స్‌ ఇవ్వనున్నారు. ఈ చిత్రాన్ని కూడా వీలైనంత తొందరగా షూటింగ్‌ పూర్తి చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

 

Exit mobile version
Skip to toolbar