Prime9

Hero Nikhil: సినిమా షూటింగ్‌లో ప్ర‌మాదం.. సెట్ ధ్వంసం, కెమెరామెన్‌కు గాయాలు.. హీరో నిఖిల్ ఏమన్నారంటే?

Major Incident in Hero Nikhil Movie Shooting: టాలీవుడ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఇండియన్ హౌస్’. ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రాంచరణ్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో సాయి మజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా, షూటింగ్ పనులు జరుగుతుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది.

 

ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలో భారీ షెట్టింగ్ ఏర్పాటు చేశారు. సముద్రం నేపథ్యం వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు ఓ భారీ ట్యాంక్ నిర్మించారు. అయితే ఆ ట్యాంకు ఒక్కసారిగా కప్పకూలింది. దీంతో వాటర్ వరదలా పారింది. ఈ ప్రవాహానికి కొంతమంది టెక్నీషియన్లు గాయపడగా.. సెట్ మొత్తం కొట్టుకుపోయింది. ఇందులో అసిస్టెంట్ కెమెరామెన్ గాయపడగా.. ఆయనను ఆస్పత్రికి తరలించారు.

 

ఈ ప్రమాదంపై హీరో నిఖిల్ సిద్ధార్థ స్పందించారు. బెస్ట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు రిస్క్ చేస్తామన్నారు. అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం నుంచి అందరం బయటపడ్డామన్నారు. అయితే విలువైన సామగ్రిని కోల్పోయామన్నారు. దేవుడి దయతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రాసుకొచ్చారు.

Exit mobile version
Skip to toolbar