If Mahesh Babu did Allu Arjun’s Pushpa Role Video Goes Viral: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 1, పుష్ప 2 మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతేడాగి డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీసు షేక్ చేసింది. విడుదలైన అన్ని భాషల్లో, అన్ని ఏరియాల్లో రికార్డు వసూళ్లు రాబట్టింది. ఫైనల్ ఇండియన్ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమా రికార్డు బ్రేక్ చేసింది.
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరోకి వెళ్లడం సహాజం. డేట్స్ లేకనే స్క్రిప్ట్ నచ్చకో హీరో కొన్ని ప్రాజెక్ట్స్ వదులుకుంటుంటారు. ఒకవేళ ఆ మూవీ హిట్ అయితే అయ్యే మిస్ అయ్యానే అనుకుంటున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలు చూసి హీరో ఫ్యాన్స్ అయ్యే.. ఇది మా హీరో చేయాల్సిన సినిమా అని బాధపడుతుంటారు. అయితే ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో హిట్స్, బ్లాక్‌బస్టర్ హిట్స్ చిత్రాల్లో తమ హీరోలను చూసుకునేందుకు ఏఐ సాయం తీసుకుంటున్నారు.
మూవీ అనౌన్స్‌మెంట్ వస్తే చాలు ఆ హీరోల లుక్‌ని ఏఐ సాయంతో ఏడిట్ చేసి మురిసిపోతున్నారు. SSMB29లో మహేష్ లుక్‌ని ఏఐ సాయంతో ఎడిట్ చేసి వైరల్ చేశారు. అలాగే ఇతర పాత్రలను సైతం ఎడిట్ చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ఫ్యాన్ ఒకరు ఆయనను ఏకంగా పుష్పరాజ్‌ను చేశాడు. పుష్ప 1, పుష్ప 2 చిత్రాల్లోని పలు కీలక సన్నివేశాల్లో మహేష్ బాబు ఏఐ వీడియో క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
ఒకవేళ మహేష్ బాబు పుష్ప మూవీ చేసుంటే.. పుష్పరాజ్ సూపర్ స్టార్ అంటూ ఈ వీడియో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఫ్యాన్స్, నెటిజన్స్ ఆకట్టుకుంటుంది. కాగా సుకుమార్ పుష్ప మూవీ కోసం మొదట మహేష్ సంప్రదించాడంటూ గతంలో ఓ రూమర్ చక్కర్లు కొట్టింది. కథ విన్న మహేష్ తనకు ఇది సెట్ అవ్వదని రిజెక్ట్ చేయడంతో పుష్ప బన్నీకి వెళ్లిందంటూ ప్రచారం జరిగింది. కానీ, సుక్కు మాత్రం పుష్ప కథను బన్నీ ఉద్దేశించే రాసుకున్నానని స్పష్టం చేశారు.
What if pushpa did by MB.. ?
" Mahesh Babu " pic.twitter.com/HcbRuNAnU8
— Sᴜʀʏᴀ.. 🐦🔥 (@Wolverine9121) June 16, 2025