Site icon Prime9

Kasturi: నటి కస్తూరికి మద్రాసు కోర్టు షాక్‌ – అరెస్టుకు రంగం సిద్ధం

Madras HC Reserves Order on Kasturi Shankar Bail: ప్రముఖ నటి కస్తూరి శంకర్‌కు మద్రాస్‌ హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె పరారీలో ఉండటంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. అయితే ఈ కేసు విషయంలో కస్తూరి మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. తనకు ముందస్తు బెయిల్‌ కావాలంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన మాటలను వెనక్కి తీసుకుని తెలుగు వారికి బహిరంగ క్షమాపణలు చెప్పానని, అయినా ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు నమోదు చేశారంటూ కస్తూరి పిటిషన్‌లో పేర్కొంది.

నేడు ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆమె పిటిషన్‌ను కోట్టివేసింది. మీ స్వపయోజనాల కోసం తెలుగు వారు, తమిళుల మధ్య ఘర్షణలు చెలరేగే విధంగా మాట్లాడటం ముమ్మాటికీ తప్పేనని న్యాయమూర్తి వారించారు. ముందస్తు బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో బెయిల్‌ నిరాకరిచండంతో కస్తూరి అరెస్టు పోలీసులు అంతా రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కస్తూరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఇటీవల నిరసన వ్యక్తం అయ్యింది. వారికి మద్దతు తెలుపేందుకు నిరసన పాల్గొన్న కస్తూరి మాట్లాడుతూ తెలుగువారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసింది. 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని, ఇప్పుడు వారంత తమది తమిళ జాతి అంటూ మాటలు చెబుతున్నారంటూ వ్యాఖ్యానించింది. అలా అయితే ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు? అని ఆమె ప్రశ్నించింది.

దీంతో ఆమె కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. అయితే తన వ్యాఖ్యలపై కస్తూరి మీడియా ముందు బహిరంగంగా క్షమాపణలు కూడా కోరింది. తెలుగు వారిని ఉద్దేశించిన తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, డీఎంకే నేతలు కావాలనే తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ వివరణ ఇచ్చింది. అయితే నిరసన సమంలో అల్లర్లలను మరింత రెచ్చగోట్టేల తన వ్యాఖ్యలు ఉండటంతో చెన్నై, మద్రాసు ప్రాంతాల్లో ఆమె కేసు నమోదైంది. దీంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. సమాన్లకు ఆమె స్పందించకపోవడంతో స్వయంగా ఆమె ఇంటికి వెళ్లగా తాళం వేసుంది. దీంతో కస్తూరి పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Exit mobile version