Site icon Prime9

Liger Trailer: లైగర్ ట్రైలర్ రిలీజ్

Tollywood: రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నటించిన లైగర్‌ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా లైగర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ట్రైలర్‌ను బట్టి చూస్తే, విజయ్ దేవరకొండ బాక్సర్ గా, టెంపర్ ఉన్న క్యారెక్టర్. నత్తితో, టోన్డ్ బాడీతో, బాక్సింగ్ కింగ్ లా రచ్చ రచ్చ చేశాడు. ఇక బాహుబలి తరువాత రమ్యకృష్ణ పవర్ ఫుల్ విమెన్ గా కనిపించింది. ఒక లయన్ కి టైగర్ కి పుట్టిండాడు. క్రాస్‌బ్రీడ్ సార్ నా బిడ్డా అన్న రమ్యకృష్ణ డైలాగ్ హైలెట్ గా నిలిచింది. మైక్ టైసన్ స్టైలిష్ ఎంట్రీ కూడ ఆకట్టుకుంది. నేను ఫైటర్‌ని అని విజయ్ చెప్పినప్పుడు, నువ్వు ఫైటర్ అయితే, నేను ఏంటి అని మైక్ అడుగుతాడు.

లైగర్‌ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీలో తెరకెక్కింది. ఇక ఈ రెండు భాషలతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా డబ్‌ చేసి రిలీజ్ చేయబోతున్నారు. పూరి, ఛార్మిలతో కలిసి కరణ్ జోహార్ నిర్మించిన లైగర్ చిత్రం ఆగస్ట్ 25, 2022న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.

Exit mobile version