Kiran Abbavaram and Rahasya Gorak Welcome Their First Child: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రయ్యాడు. గురువారం ఆయన భార్య రహస్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఈ గుడ్‌న్యూస్‌ను షేర్ చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. హనుమాన్ జయంతి రోజునే మగబిడ్డ పుట్టడంతో వారింట్లో ఆనందాలు వెల్లువెత్తున్నాయి.
తండ్రయిన సందర్బంగా ఆనందంలో ఉన్న కిరణ్ అబ్బవరం ఆస్పత్రిలో ఊయాలలో ఉన్న తన బిడ్డను కాలును అప్యాయంగా ముద్దాడాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. మగబిడ్డ పుట్టాడంటూ ఈ గుడ్‌న్యూస్‌ను షేర్ చేసుకున్నాడు. “మగబిడ్డ పుట్టాడు. హానుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్యూ రహస్య. జై శ్రీరామ్” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. కిరణ్ అబ్బవరం తండ్రయిన సందర్భంగా ఆయనకు ఫ్యాన్స్, సినీ సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
కాగా పెళ్లయిన ఏడాది కూడా తిరక్కుండానే కిరణ్-రహస్యలు తల్లిదండ్రులు అయ్యారు. కాగా గతేడాది ఆగష్టులో కిరణ్ అబ్బవరం, రహస్యల పెళ్లి జరిగింది. వీరిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. రాజావారు-రాణివారు చిత్రంలో వీరిద్దరు తొలిసారి జంటగా నటించారు. వీరికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమా టైంలోనే ప్రేమలో పడ్డ వీరిద్దరు కొంతకాలం సీక్రెట్ డేటింగ్లోఉన్నారు. పెద్ద అంగీకారంతో 2024 ఆగష్టు 22న వీరిద్దరు వివాహం జరిగిందిజ ఈ ఏడాది జనవరిలో ప్రెగ్నెన్సీ ప్రకటన చేశారు. ఆ తర్వాత సీమంతం ఫోటోలను షేర్ చేసి అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు. మే 22న మగబిడ్డ పుట్టాడంటూ శుభవార్త చెప్పింది ఈ టాలీవుడ్ జంట.