Site icon Prime9

Khushbu: విశాల్‌ ఆరోగ్య పరిస్థితిని వివరంగా చెప్పిన నటి నటి ఖుష్బు

Khushbu Sundar About Vishal Health: గత కొన్ని రోజులుగా హీరో విశాల్‌ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మదగజరాజు మూవీ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతుండ చేతులు వణుకుతూ కనిపించాయి. అలాగే మాటలు కూడా సరిగ రావడం లేదు. దీంతో ఆయనకు ఏమైందా అని అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుత్నారని, అందుకే ఈవెంట్‌లో సరిగ మాట్లాడలేకపోయారని ఆయన టీం స్పష్టం చేసింది. అయినా పలు యూట్యూబ్‌ ఛానల్‌ విశాల్‌ ఆరోగ్య పరిస్థితిపై రకరకాలు కథనాలు సృష్టిస్తున్నారు.

ఈ క్రమంలో నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బు సుందర్‌ స్పందించారు. మదమగరాజు మూవీ రిలీజ్‌ సందర్భందా తాజాగా ఆమె ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా విశాల్‌ ఆరోగ్యంపై ఆమెను ప్రశ్నించారు. ఈవెంట్‌లో విశాల్‌ను చూడగానే మీరు చాలా ఎమోషనల్‌ అయ్యారు, అసలు ఆయనకి ఏమైంది? అని యాంకర్‌ ప్రశ్నించారు. దీనికి ఖుష్బూ స్పందిస్తూ.. విశాల్‌ అప్పుడు డెంగ్యూ ఫివర్‌తో బాధపడుతున్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడే ఆయనకు జ్వరం వచ్చింది. ఆ విషయం మాకు తెలియదు. 103 ఫీవర్‌తో ఆయన ఈవెంట్‌కు వచ్చారు.  అందువల్లే చలికి వణికిపోయారు. ఈవెంట్‌కి వచ్చేవరకు ఆయన జ్వరం అనే విషయం మాకు తెలియదు.

ఇంత ఫీవర్‌ పెట్టుకుని ఎందుకు వచ్చారని అడిగాను. అందుకు విశాల్‌ ’11 ఏళ్ల తర్వాత మన సినిమా రిలీజ్ అవుతుంది. రాకపోతే ఎలా? నేను ఈ వెంట్‌కు తప్పకుండ రావాల్సిందే. అందుకే వచ్చాను’ అన్నారు. ఈవెంట్‌ తర్వాత ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లాడం. ఇప్పుడు కోలుకుంటున్నారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు” అని ఆమె స్పష్టం చేశారు. అనంతరం వ్యూస్‌ కోసం విశాల్‌ ఆరోగ్యంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా ఈజీగా ఫేక్‌ న్యూస్‌లు రాసేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఖుష్బు విశాల్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తామిద్దరు ఎప్పుడు కలిసి వర్క్‌ చేయలేదు, కానీ తాము క్లోజ్‌గా ఉంటామని చెప్పారు. మొదటిసారి విశాల్‌ని ఓ పార్టీలో కలిశాను. అప్పటి నుంచి మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. విశాల్‌ నటించిన కొన్ఇన సినిమాలు నాకు చాలా ఇష్టం. అతను టాలెంటెడ్‌ హీరో. సినిమాలు అంటే ఎంతో ఆసక్తి” అని చెప్పుకొచ్చారు. కాగా ఖుష్బు భర్త, దర్శకుడు సుందర్‌ సి దర్శకత్వంలోనే విశాల్‌ మదమగరాజు మూవీ తెరకెక్కింది. ఇందులో అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్‌లు హీరోయిన్లుగా నటించారు. ఎప్పుడో 11 ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలకు నోచుకుంది. ఈ క్రమంలో ఇటీవల చెన్నైలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు.

Exit mobile version