KGF 3: కన్నడ హీరో యష్ కెరీర్ ను కేజీఎఫ్ ముందు తరువాతగా చెప్పుకోవచ్చు. కేజీఎఫ్ చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద అన్ని రికార్డులను బద్దలు కొట్టి 1250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14న థియేటర్లలోకి వచ్చింది మొదలు ఇది బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగించింది. కేజీఎఫ్ ఫ్రాంచైజీ యొక్క 3వ విడత కోసం అభిమానులు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం KGF చాప్టర్ 3 2025లో ప్రారంభమవుతుంది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు ప్రభాస్ నేతృత్వంలోని సాలార్ మూవీతో బిజీగా ఉన్నాడు. అంటే 2026లో మాత్రమే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
KGF 3 కాదు.. ఛాప్టర్ 5 కూడా ఉంటుంది..
నిర్మాత విజయ్ కిరగందూర్ KGF 3 కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ఈ చిత్రం 2025లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. కేజీఎఫ్ ఫ్రాంచైజీని తీసుకునే ప్రణాళికలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు. కేజీఎఫ్ ఫ్రాంచైజీలో 5వ భాగం తర్వాత మరో హీరో రాకీ భాయ్ పాత్రను పోషించే అవకాశం ఉందని, జేమ్స్ బాండ్ సిరీస్ మాదిరిగానే, హీరోలు మారుతూ ఉంటారు,” అని అతను చెప్పాడు.
మరోసారి రానున్న రాకీ భాయ్
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన, కేజీఎఫ్ చిత్రం కధానాయకుడు రాకీ యొక్క పెరుగుదల మరియు పతనాన్ని చిత్రీకరించింది. ఈ పాత్ర తన బంగారు నిల్వలన్నింటినీ సముద్రంలోకి తీసుకెళ్తుండగా జలసమాధి కావడంతో చిత్రం ముగిసింది. రెండవ భాగంలో యష్, సంజయ్ దత్, రవీనా టాండన్ మరియు శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు.
మరి తర్వలో మరోసారి రాకీ భాయ్ రానున్నాడన్న వార్తతో అటు కోలీవుడ్ అభిమానులతో పాటు యావత్ దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాకీభాయ్ బతికే ఉన్నాడా.. సముద్రంలో పడిపోయినా చనిపోలేదా.. KGF 3లో మరల కనిపించనున్నారా.. అందులో విలన్స్ ఎవరు..? అసలు ఈ ఛాప్టర్లో కేజీఎఫ్ ని ఎవరు సొంతం చేసుకున్నారు.. అనే ప్రశ్నలకు ఈ సినిమాలో సమాధానం దొరకుతుందని ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరి KGF 3 సినిమా షూట్ పూర్తి చేసుకుని ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందో తెలియాలంటే ముందుగా ప్రభాస్ సాలార్ మూవీ విడుదలవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రశాంత్ నీల్ ఈ సినిమా పనులను ప్రారంభిస్తారని కోలీవుడ్ వర్గాల టాక్. ఇకపోతే కేజీఎఫ్ మూవీ ద్వారా రాకీభాయ్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్
Hyderabad Costly Dog: హైదరాబాద్‌లో రూ. 20 కోట్ల విలువైన కుక్క.. ఇందులో నిజమెంత..?
Nandamuri Balakrishna : తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఓపెన్ అయిన బాలకృష్ణ..
Hyderabad Costly Dog: హైదరాబాద్‌లో రూ. 20 కోట్ల విలువైన కుక్క.. ఇందులో నిజమెంత..?
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/