Prime9

Kevvu Karthik Marriage : ఓ ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్.. పెళ్ళికి హాజరైన పలువురు ప్రముఖులు

Kevvu Karthik Marriage : తెలుగు ప్రజలకు జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయం అయ్యాడు కెవ్వు కార్తీక్. తనదైన శైలిలో స్కిట్ లను చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు చేచుకున్నాడు. మిమిక్రి ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టిన కార్తీక్.. జబర్దస్త్ లో ఆర్టిస్ట్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం టీం లీడర్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలు, షోలతో బిజీగా ఉన్నాడు కెవ్వు కార్తీక్. ఇటీవలే తాను ఓ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని ప్రకటించారు.

ఈ మేరకు గురువారం నాడు కెవ్వు కార్తీక్ వివాహం జరిగిందని తెలుస్తుంది. శ్రీలేఖ అనే అమ్మాయితో కార్తీక్ వివాహం ఘనంగా జరగగా.. ఆ వేడుకకు పలువురు టీవీ నటులు, టెక్నీషియన్స్, జబర్దస్త్ కమెడియన్స్, సినీ ప్రముఖులు కూడా విచ్చేశారు. దాంతో కెవ్వు కార్తీక్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలానే పలువురు అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో కొత్త దంపతులకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

ఇటు బుల్లితెర నుంచి కూడా పులువురు ఆర్టిస్ట్ లు హాజరై పెళ్ళి వేదికపై సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ రకరకాల కమెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా కొత్త జంట కు శుభాకాంక్షలు చెబుతూ.. మెసేజ్ లు పెడుతున్నారు.

Exit mobile version
Skip to toolbar