Site icon Prime9

Kavya Thapar: ఎల్లో శారీలో మతిపోగోడుతున్న కావ్య థాపర్‌ – లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Kavya Thapar Images

Kavya Thapar Stunning Look: కావ్యా థాపర్‌.. ఈ మధ్య ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ ఏడాది బ్యాక్‌ టూ బ్యాక్ చిత్రాలతో అలరించింది. మాస్‌ మహారాజా ఈగల్‌, డబుల్‌ ఇస్మార్ట్‌, విశ్వం చిత్రాల్లో తన గ్లామర్‌తో కుర్రకారు మనసులు దోచేసింది.

మరోవైపు ఈ భామ సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ హాట్‌ బ్యూటీ చీరలో మెరిసింది. ఎల్లో కలర్‌ చీరలో ఫోటోలకు ఫోజులు ఇస్తూ వయ్యారాలు పోయింది.

ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కావ్య.. నిన్ను ఇలా చూస్తుంటే మతిపోతుందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా కావ్యా థాపర్‌ ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ సినిమా పద్దగా విజయం సాధించకపోవడంతో ఆమెకు ఆశించిన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఏక్‌ మినీ కథలో నటించింది.

డైరెక్ట్‌ ఓటీటీ రిలీజైన ఈ సినిమాకు మంచి విజయం సాధించింది. అలాగే కావ్యకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్స్‌ క్యూ కడుతున్నాయి.

ఒక్క తెలుగులోనే కాదు తమిళ్‌, హిందీలోనూ అవకాశాలు అందుకుంటోంది. ఇక ఈ ఏడాది మాస్‌ మహారాజా ఈగల్‌ సినిమాతో పాటు రామ్ పోతినేని సరసన డబుల్‌ ఇస్మార్ట్‌, గోపిచంద్‌ విశ్వం సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

స్టార్‌ హీరోల సరసన ఆఫర్స్‌ కొట్టేస్తూ ఈ భామ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ మారింది. ఇక కావ్య పంజాబీలో సినిమాలు చేసింది.

Exit mobile version