Site icon Prime9

Kareena Kapoor: కొత్త అవతారమెత్తనున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

Bollywood: బాలీవుడ్లో మరో టాప్ హీరోయిన్ కూడా నిర్మాతగా మారనుంది. ఈ మధ్య టాప్ హీరోయిన్స్ కొత్త ట్రెండును సెట్ చేస్తున్నారు. అది ఏంటా అని ఆలోచిస్తున్నారా, అదే అండి నిర్మాతగా కొత్త బాధ్యతలు తీసుకోవడం. ప్రస్తుతం బాలీవుడ్లో   లేడీ నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో పెద్ద స్టార్ హీరోయిన్లు సైతం నిర్మాతలగా మారారు. ఇటీవలి కాలంలో కొత్త హీరోయిన్స్ తమదైన రీతిలో చిన్న చితక సినిమాలను నిర్మిస్తున్నారు. కంగనా రనౌత్, అనుష్క శర్మ, అలియాభట్, దీపికా పదుకొణే లాంటి పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా నిర్మాతలగానూ రాణించారు. ఇప్పుడు హీరోయిన్లు నటన మాత్రమే కాకుండా , నిర్మాతలగా కూడా మారుతున్నారు. ఒక పక్క నటిస్తూనే ఇంకో పక్క ప్రొడక్షన్ పనులకు కూడా బాధ్యతలగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో కరీనా కపూర్ కూడా చేరింది. ఈ బాలీవుడ్ భామ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. మొదటి ప్రొడక్షన్ ప్రయత్నంగా , ఇంకో లేడి ప్రొడ్యూసర్ తో చేతులు కలిపి ఓ సినిమాని నిర్మించనున్నారు. దర్శకుడు హన్సల్ మోహతా తెరకెక్కిస్తోన్న సినిమాకు ఏక్తాకపూర్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది.

ఈ విషయాన్ని కరీనానే స్వయంగా బయటికి వెల్లడించింది. నిజానికి ఈ సినిమాను 2021 లోనే నిర్మించాలని అనుకున్నారట. కానీ కొన్ని అకస్మాత్తు అనివార్య కారణాల వల్ల ఇంత కాలం ఆలస్యం అయింది. ఇప్పటికే  స్ర్కిప్ట్ పనులన్నీ పూర్తి చేశారు. ఏక్తాకపూరుతో కలిసి పనిచేయడం కొత్త అనుభూతినిస్తుంది. ఈ సినిమాలో నటించడం కంటే బరువైన బాధ్యతలు ఎక్కువ మోయాల్సి వస్తుందని కరీనా గారు పేర్కొన్నారు. సినిమాలో నటిగా ఐతే అక్కడితోనే నా బాధ్యత ముగుస్తుంది. కానీ ఇప్పుడు ఆ పాత్ర చేసాక నా బాద్యత ఇంకా ఎక్కువుగా ఉంటుంది. నిర్మాణం అంటే సినిమా మొదలు దగ్గర నుంచి ముగింపు  వరకూ ప్రతీ పనిని దగ్గరుండి చూసుకోవాలి. అటుపై ప్రచార పనులకు కూడా ఎంతో సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడం అంటే చిన్న విషయం కాదు. ముందు నేను బలంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ పనులన్నీ చేయగలనని కరీనా పేర్కొన్నారు.

కరీనా కథానాయికగా నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఎన్నో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. అయిన సినిమా తీవ్ర నిరాశపరిచింది. ఆ పరాజయం నుంచి కరీనా తొందరగానే బయట పడింది. కొత్త ప్రాజెక్టు పనులపై దృష్టి పెట్టనుంది. ఈ పనులను వేగంగా పూర్తిచేసే ఉత్సాహం తనలో కనిపిస్తుంది. ఈ
నేపథ్యంలోనే  నిర్మాతగా తన కొత్త చిత్రం గురించి బయటికి వెల్లడించింది. ఈ బాలీవుడ్ భామ ఇదే ఉత్సాహాన్ని చివర వరకు కొనసాగిస్తుందా ? లేదా అన్నది వేచి చూడాలి.

Exit mobile version