Site icon Prime9

Shihan Hussaini Died: నటుడు, పవన్‌ కళ్యాణ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ గురువు షిహాన్‌ హుస్సేని కన్నుమూత

shihan hussaini died

shihan hussaini died

Karate Expert and Actor Shihan Hussaini Died: ఏపీ డిప్యూట సీఎం, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీన్యుడనే విషయం తెలిసిందే. తమ్ముడు సినిమాలో స్వయంగా ఆయనే మార్షల్‌ ఆర్ట్స్‌ చేసి అందరిని సర్‌ప్రైజ్ చేశారు. ఆయనకు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చింది తమిళనాడుకు చెందిన కోలీవుడ్‌ నటుడు, కరాటే మాస్టర్‌ షిహాన్‌ హుస్సేని (60). పవన్‌ కళ్యాణ్‌కి మాత్రమే కాదు కోలీవుడ్‌కి చెందిన పలువురికి ఆయన శిక్షణ ఇచ్చారు. అయితే ఇటీవల ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన కన్నుమూశారు.

మార్షల్‌ ఆర్ట్స్‌, కరాటేలో శిక్షణతో పాటు పలు చిత్రాల్లోనూ నటించారు. అయితే కొంతకాలంగా ఆయన బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన సోమారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయనకు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.  ఆయన చనిపోవడానికి కొద్ది రోజులు ముందు హుస్సేనీ, పవన్‌ కళ్యాణ్‌కు తన శిక్షణ కేంద్రాన్ని కొనాల్సిందిగా అభ్యర్థించారు.

“ప్రస్తుతం ఆయన ఉపముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలుసు. కానీ నా అభ్యర్థన ఆయనకు వరకు చేరితే తప్పకుండా స్పందిస్తారు. తన గురించి నాకు బాగా తెలుసు. నా వద్ద శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఆయనకు పవన్‌ అనే పేరు నేనే పెట్టాను. శిక్షణ తీసుకుంటున్న సమయంలో కేంద్రాన్ని శుభ్రం చేయడమే కాదు.. ప్రతిరోజూ నాకు టీ అందించేవాడు. మార్షల్‌ ఆర్ట్స్‌ దేశవ్యాప్తంగా విస్తరింప చేయాలని ఇద్దరం మాట్లాడుకునేవాళ్లం. అలాంటి పవన్‌ ఈ మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ కేంద్రాన్ని కొనుగోలు చేస్తే భవిష్యత్‌ తరాల కోసం నిర్వహిస్తారని ఆశిస్తున్నాను” అంటూ తన చివరి కోరికను బయటపెట్టారు. కాగా పవన్ తో పాటు దళపతి విజయ్ కి కూడా ఆయన మార్షల్ ఆర్ట్స్ శికణ ఇచ్చారు.

Exit mobile version
Skip to toolbar