Prime9

Kannappa Comic Book: కన్నప్ప కామిక్ బుక్‌ సిరీస్ – కొత్త ఎపిసోడ్ చూశారా?

Kannappa Animated Comic Book: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మైథలాజికల్‌ డ్రామా అత్యంత భారీ బడ్జెట్‌తో మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమాలను జరుపుకుంటుంది. జూన్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ముకేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్‌, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌, మలయాళ స్టార్‌ మోహన్‌ లాల్‌, కాజల్‌ అగర్వాల్‌ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

ప్రభాస్‌ నంది పాత్రలో కనిపించనుండగా.. అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించబోతున్నాడు. అంతేకాదు ఇతర పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటుల ఇందులో నటిస్తున్నారు. భారీ తారగణంలో ఈ సినిమాలో భాగం అవ్వడంతో కన్నప్ప భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ వస్తున్న అప్‌డేట్స్‌ కూడా మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఈ సారి జూన్‌ 27న పక్కాగా రాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్‌ కన్నప్ప ప్రమోషన్స్‌ వినూత్నంగా చేస్తోంది. కన్నప్ప యానిమేటెడ్‌ కామిక్‌ బుక్‌ పేరుతో వరుస సిరీస్‌లను విడుదల చేస్తుంది. ఇప్పటికే రెండు భాగాలను విడుదల చేసిన టీం.. తాజాగా మూడో పార్ట్‌ని రిలీజ్‌ చేసింది.

 

ఇందులో తిన్నడికి వాయు లింగం ఎలా ఎదురుపడింది. ఆ లింగానికి కళ్లు ఎలా వచ్చాయి.. వాటి నుంచి రక్తం రావడం.. తన కళ్లను తిసి లింగానికి పెట్టడం. ఆ తర్వాత తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు అనేది ఈ మూడో భాగంలో చూపించారు. యానిమేటెడ్‌ సిరీస్‌గా వస్తున్న ఈ సిరీస్‌లు ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానున్న ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌ మీద కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్టీఫెన్‌ దేవాన్సీ సంగీతం అందిస్తుండగా.. ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవ కొరియోగ్రాఫీ అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్‌లకు మంచి స్పందన వచ్చింది.

Kannappa Animated Comic Book Episode-3 Telugu | Vishnu Manchu | Mohan Babu | Prabhas | Mukhesh KS

Exit mobile version
Skip to toolbar