Actor Vijaya Raghavendra: కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన రాఘవేంద్ర కన్నుమూశారు. బ్యాంకాక్‌లో విహారయాత్ర చేస్తున్న సమయంలో ఆమె గుండెపోటుతో మరణించింది ఆమె మృతదేహం మంగళవారం బెంగళూరు చేరుకుంటుంది. 2016లో విడుదలైన అపూర్వ సినిమాలో స్పందన అతిథి పాత్రలో నటించింది. స్పందన తన భర్త నటించిన చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఆమె మంచి డ్యాన్సర్.
ఛాతీలో నొప్పిగా ఉందని..(Actor Vijaya Raghavendra)
స్పందన తనకు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారని అక్కడ కన్నుమూసారని తెలుస్తోంది. బెంగుళూరుకు చెందిన స్పందన 2007లో విజయ్ రాఘవేంద్రను వివాహం చేసుకుంది. ఈ జంటకు శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. వారి 16వ వివాహ వార్షికోత్సవానికి కేవలం 19 రోజుల ముందు స్పందన మరణించింది. ఇలా ఉండగా స్పందన మృతి పట్ల కన్నడ చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. స్పందన మృతిపట్ల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రముఖ కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన మృతి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె ఆత్మ కోసం ప్రార్థిస్తున్నాను అంటూ సిద్దరామయ్య ట్వీట్ చేసారు.
ఆగష్టు 25న విడుదల కానున్న తన రాబోయే చిత్రం ‘కద్దా’ కోసం ప్రమోషనల్ కార్యకలాపాలను ప్రారంభించడంలో విజయ రాఘవేంద్ర బిజీగా ఉన్నారు. అతను సీతారాం బెనోయ్ కేస్ నంబర్ 18, యదా యాదా హి ధర్మస్య, నాన్న నిన్న ప్రేమ కథే, శివయోగి శ్రీ పుట్టయ్యజ్జ మరియు ఫెయిర్ & లవ్లీ వంటి హిట్ చిత్రాల్లో నటించారు.