Site icon Prime9

Kamal Haasan : సినిమా టైటిల్ కింద ఇది నిజమైన కథ అని రాస్తే సరిపోదు అంటూ.. ఆ మూవీపై కౌంటర్ వేసిన కమల్ హాసన్

kamal haasan shocking comments on kerala story movie

kamal haasan shocking comments on kerala story movie

Kamal Haasan : ‘ది కేరళ స్టోరీ’..  ఇటీవల కాలంలో ఈ సినిమాపై వచ్చినన్ని వివాదాలు మరే సినిమాపై రాలేదని చెప్పాలి. కానీ అన్ని అవాంతరాలను మే 5న విడుదల అయిన ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా వివాదాలు గట్టిగా వచ్చాయి. సుదీప్తో సేన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విపుల్‌ అమృత్‌ లాల్‌ షా నిర్మాతగా వ్యవహరించారు. అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలాని, సిద్ధ ఇద్నాని ప్రధాన పాత్రలు పోషించారు. అయితే నెగటివ్ పబ్లిసిటీ ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతూ 200 కోట్లు కొల్లగొట్టింది. అలానే ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా కూడా నిలిచింది.

అయితే తాజాగా ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్పందించారు. ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేవలం ప్రచారం కోసం తీసే సినిమాలకు తాను వ్యతిరేకం అని చెప్పుకొచ్చారు. “నేను మీకు ఇప్పటికే చెప్పాను. నేను ప్రచారం కోసం తీసే చిత్రాలకు వ్యతిరేకం. సినిమా టైటిల్ కింద ఇది నిజమైన కథ అని రాశారు. కానీ, నిజం అనే రాస్తే సరిపోదు. నిజంగా నిజం ఉండాలి. ఈ సినిమాలో చూపించే నిజం నిజం కాదు” అని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.

మరోవైపు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టడం పట్ల నటి ఆదా శర్మ సంతోషం వ్యక్తం చేసింది. “తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో విడుదల కాకాపోయినా, దేశంలో రూ. 200 కోట్ల నికర వసూళ్లను సాధించిన మొదటి మహిళా చిత్రంగా నిలిచింది. జీవితంలో అత్యుత్తమ విషయాలు ఊహించనివి. అంచనాలకు మించి ఈ సినిమా రాణిస్తోంది. ఈ సినిమా ఈ రేంజిలో విజయం అందుకోవడం పట్ల సంతోషంగా ఉంది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చింది.

సినిమా కథ ప్రకారం.. కేరళలో కొన్నేళ్లుగా వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. వారిని వెతికే నేపథ్యంతో చిత్రం సాగుతుంది. చివరకు నలుగురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరుతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథ. అయితే, కేరళకు చెందిన కొందరు అమ్మాయిలు ఇలా ఐసిస్‌లోకి చేరడం, ఉగ్రవాద సంస్థల్లో చేరి, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు అని చూపించడమే వివాదానికి కారణమవుతోంది.

Exit mobile version
Skip to toolbar