Site icon Prime9

Kamal Haasan : కమల్‌ హాసన్‌ కొత్త సినిమా అనౌన్స్ మెంట్.. దర్శకుడు ఎవరంటే ?

kamal haasan new movie announcement details

kamal haasan new movie announcement details

Kamal Haasan : లోకనాయకుడు కమల్‌ హాసన్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది `విక్రమ్‌`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న కమల్.. ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలానే ప్రభాస్‌ `ప్రాజెక్ట్‌ కె` మూవీలో కూడా నటిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. మరోవైపు మణిరత్నంతో ఇప్పటికే ఓ సినిమాని ప్రకటించారు. ఆ సినిమా చేయడానికి కొంత టైమ్‌ పడుతుందని సమాచారం.

ఈ నేపథ్యంలో తాజాగా మరో సినిమాని అనౌన్స్ చేశారు కమల్‌. హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. కాగా తాజాగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. `కేహెచ్‌233`గా ఈ సినిమా రూపొందబోతుంది. `రైజ్‌ టూ రూల్‌` అనే ట్యాగ్‌ లైన్‌తో సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్  లో కమల్‌ జెండా పట్టుకుని ఓ నాయకుడిగా పోరాడుతున్నట్టు.. కనిపిస్తుండడం గమనార్హం. ఇక ఈ సినిమాని రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్ పతాకంపై కమల్‌ హాసన్‌, మహేంద్రన్‌ నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్ నడుస్తుంది.

 

Exit mobile version