Site icon Prime9

Kamal Haasan meets Kalathapaswi :కళాతపస్విని కలిసిన కమల్ హాసన్

Kamal Haasan

Kamal Haasan

Viral Pic: కళాతపస్వి దర్శకుడు కె.విశ్వనాథ్‌ను నటుడు కమల్‌హాసన్‌ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కమల్ హాసన్ కే విశ్వనాథ్‌ చేయి పట్టుకుని ఆత్మీయంగా పలుకరిస్తున్న ఫొటో ఇపుడు ట్రెండింగ్‌ అవుతోంది.కమల్ హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో విశ్వనాథ్ ఆశీర్వాదం తీసుకుంటున్న చిత్రాన్ని పోస్ట్ చేసారు. మాస్టర్ #కె.విశ్వనాథ్ సర్‌ని అతని ఇంట్లో కలిసాను. చాలా జ్జాపకాలు మరియు గౌరవం!!” అని అతను ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు.

విశ్వనాథ్‌, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమలో మరపురాని చిత్రాలుగా నిలిచిపోయాయి. అంతేకాదు వీరిద్దరు కురుతిపునల్, మహానటి, ఉత్తమ విలన్ చిత్రాల్లో కలిసి నటించారు.

ఈ సంవత్సరం, కమల్ హాసన్ ‘విక్రమ్’తో అతిపెద్ద కమర్షియల్ సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం అతను దర్శకుడు శంకర్ యొక్క ‘ఇండియన్ 2’లో కూడా నటిస్తున్నాడు అతని టీవీ షో ‘బిగ్ బాస్ తమిళ్’ విజయవంతమైంది.

Exit mobile version