Site icon Prime9

Chandramukhi-2: చంద్రముఖిగా కాజల్.. ఫిలిం సిటీలో షూటింగ్

chandramukhi 2 heroine kajal

chandramukhi 2 heroine kajal

Chandramukhi-2: చంద్రముఖి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఆ సినిమా ఓ రేంజ్ హిట్ అందుకుంది. కాగా ఇప్పుడు పి. వాసు దర్శకత్వం లో చంద్రముఖి -2 చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ మంగళవారం నాడు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మొదలయ్యింది అని సమాచారం. ఈ మూవీ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా మరి ఈ చిత్రంలో చంద్రముఖి ఎవరు అనేది సస్పెన్స్ గా మారిన క్రమంలో కాజల్ ఈ పాత్ర పోషించబోతున్నారంటూ సమాచారం.

సినీ ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చాటుకున్న అగ్రకథానాయిక కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో చంద్రముఖి పాత్ర వేస్తోందని తెలిసింది. ఈ సినిమాలో ముందు ఎవరెవరినో హీరోయిన్ గా అనుకున్న, దర్శకుడు వాసు, రాఘవ లారెన్స్ ఆఖరికి కాజల్ అయితే బాగుంటుంది అని ఆమెకి కథ చెప్పాకు. కథ విన్న వెంటనే ఆమె ఈ క్యారెక్టర్ చెయ్యడానికి ఒప్పుకుందని సమాచారం.
అయితే ఈ రోల్ కాజల్ అగర్వాల్ సినిమా కెరీర్ లో ఒక మంచి కీ రోల్ అవుతుందని కూడా చిత్ర యూనిట్ అభిప్రాయం.

చంద్రముఖి మొదటి పార్టు లో రజనీకాంత్, జ్యోతిక, నయనతార నటించారన్న సంగతి తెలిసిందే. దానికి కూడా పి. వాసునే దర్శకత్వం వహించారు. ఇప్పుడు తీస్తున్న పార్ట్ 2 దానికి సీక్వెల్ లానే ఉంటుంది, కానీ అందులోని కేవలం చంద్రముఖి పాత్రని తీసుకున్నారని మొదటి సినిమాలో నటించిన నటులను తీసుకోలేదని సమాచారం.

ఇదీ చదవండి సరోగసి వివాదం.. విఘ్నేశ్ ఆసక్తికర పోస్ట్

Exit mobile version