Jr NTR Watch Richard Mille Cost Turns Head: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా తారక్ ముంబైలోనే ఉంటున్నాడు. అయితే ఇటీవల తారక్ ముంబై ఎయిర్‌పోర్టులో మెరిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో తారక్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ వాచ్ బ్రాండ్ నేమ్, ధర ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ‘వార్ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంతోనే తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారీ యాక్షన్ సీక్వెన్స్ సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. అయితే హృతిక్, తారక్‌లతో కలిపి ఓ సాంగ్ షూట్ మిగిలి ఉందట. ఇది ఫైనల్ సాంగ్ అని, ఇందులో దాదాపు 500 మంది డ్యాన్సర్స్ పాల్గొననున్నారట. ఈ సాంగ్ రిహార్సల్స్ సమయంలో హృతిక్ కాలికి గాయం అయినట్టు తెలుస్తోంది. దీంతో ఈ పాట షూటింగ్‌కి బ్రేక్ పడినట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ పాట షూటింగ్ కోసం ముంబై వెళ్లిన తారక్ ఎయిర్‌పోర్టు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఎన్టీఆర్ క్లాసీ క్యాజువల్ బట్టల్లో కనిపించాడు. ఇందులో ఆయన హెయిర్ స్టైల్, అవుట్ ఫిట్ స్టైలిష్‌గా కనిపించారు. ఈ సందర్భంగా ఆయన ధరించిన అల్ట్రా లగ్జరీ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ వాచ్ బ్రాండ్, స్పెషాలిటి, ధర ఎంత అని అంతా ఆరా తీస్తున్నారు. దీంతో ఈ వాచ్ ఫీచర్స్, ధర తెలిసి అంతా నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఈ వాచ్ కాస్ట్‌తో కొన్ని వందల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హ్యాపీ బతికేస్తాయంటూ కామెంట్స్ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ వాచ్ కాస్ట్, ధర
తారక్ ధరించి ఆ వాచ్ ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు సంబంధించింది. దీని పేరు రచర్డ్ మిల్లే 40-01 టూర్ బిల్లాన్ మెక్ లారెన్ స్పీడ్ టైయిల్. దీనికి షాట్ ఈ రిచర్డ్ మిల్లె లిమిటెడ్ ఎడిషన్ అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు మాత్రమే ఈ వాచ్ కోనగలరట. ఇక ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ధర విషయానికి వస్తే రూ. 7.47 కోట్లు ఉంటుందట. ఈ విషయం తెలిసి అంతా అవాక్కావుతున్నారు. ఒక వాచ్ ధర ఇన్ని కోట్లు. ఈ డబ్బుతో కొన్ని వందల మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బతికేయచ్చు అంటూ నోరేళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వాచ్ ధర సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. గతంలోనూ ఎన్టీఆర్ ఈ వాచ్ పెట్టుకుని కనిపించాడు. ముంబైలో ‘వార్ 2’ షూటింగ్ టైంలో, అలాగే ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్ ఈవెంట్ లోనూ ఇదే వాచ్ ధరించి కనిపించాడు తారక్.