Jr NTR Request to Fans: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి తెలిసిందే. నందమూరి హీరోలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమం అయినా తారక్ తారక్ అంటూ నినాదాలు చేస్తారు. ఏ ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా సీఎం సీఎం అంటూ ఎన్టీఆర్ రాజకీయాలకు రావాలనే తమ ఆకాంక్షని వెల్లడిస్తుంటారు. ఈ మధ్య తారక్ తన అభిమానులను కలుస్తానంటూ తరచూ చెప్పుకొచ్చుస్తున్నాడు.
అయితే అది ఎప్పుడనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఆ సమయంలో కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారందరికి ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తానంటూ ఓ ప్రకటన ఇచ్చాడు. ఈ సందర్భంగా తన అభిమానులందరికి ఎన్టీఆర్ ఓ విజ్ఞప్తి కూడా చేశాడు. “మిమ్మల్ని కలిసేందుకు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నా. త్వరలోనే మీ అందరిని కలుస్తాను. సమావేశం ఏర్పాటు చేసి దాని ద్వారా నేరుగా మిమ్మల్ని కలిసి వ్యక్తిగతం మాట్లాడుతాను.
నాపై మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే ఈ సందర్భంగా మీ అందరి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. నన్ను కలిసేందుకు అభిమానులెవరు కూడా పాదయాత్రలు చేయకండి. మీ సంక్షేమమే నాకు ముఖ్యం. నన్ను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న మీ ఆసక్తిని అర్థం చేసుకుని వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. అధికారుల అనుమతి తీసుకుని అందరిని సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయంలో పడుతుంది. కాబట్టి ఈ విషయంలో అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నా” అని పేర్కొన్నారు.