Site icon Prime9

Jr NTR: వార్‌ 2 సెట్స్‌ నుంచి ఎన్టీఆర్‌ ఫోటో లీక్‌ – టెన్షన్‌లో మూవీ టీం!

Jr NTR Photo Leak From War 2: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ చేతిలో భారీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. దేవర 2, వార్‌, ఎన్టీఆర్‌31 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. గతేడాది దేవర సినిమాలో భారీ విజయం అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మొదటి భాగం ఇప్పటికే విడుదలై భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత విడుదలైన దేవర సినిమా ఆ భారీ హిట్ అవ్వడంతో నందమూరి అభిమానులంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

ప్రస్తుతం తారక్‌ తన బాలీవుడ్‌ డెబ్యూ చిత్రం వార్‌ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ హీరోగా నటించిన వార్ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. వార్‌ 2 ఎన్టీఆర్‌ భాగం అవ్వడంతో తెలుగు ఆడియన్స్‌, ఇతర భాషలోని ఆయన అభిమానులకు ఈ సినిమా ప్రత్యేకంగా మారింది. అది తారక్‌ బాలీవుడ్‌ డెబ్యూ చిత్రం కావడంలో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇప్పటి వరకు ఈచిత్రం నుంచి తారక్‌ సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దీంతో వార్‌ 2 మూవీ కోసం ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ సెట్‌లోని ఎన్టీఆర్‌ ఫోటో లీక్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇది చూసి తారక్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. అసలైన అప్‌డేట్స్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయింటింగ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ చిత్రంగా వార్‌ 2 చిత్రం రూపొందుతోంది. యాక్షన్‌ సీన్స్‌తో పాటు భారీ ఛేజింగ్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయంటున్నారు.

యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్‌ గుఢాచారి, రా ఎజెంట్‌గా కనిపించనున్నాడని టాక్‌. కాగా వార్‌ సినిమా షూటింగ్‌ సెట్స్‌ నుంచి తరచూ హీరో ఫోటోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. గతంలోనూ ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్‌ల లుక్‌లు బయటకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరోసారి తారక్‌ ఫోటో బయటకు రావడంపై మూవీ టీం టెన్షన్‌ పడుతుంది. అలాగే ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు జాగ్రత్తగా ఉండాలని మూవీ టీం హెచ్చరిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar