Site icon Prime9

NTRNeel: 3వేల మందితో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ – మూవీ బడ్జెట్‌ ఎంతో తెలుసా?

NTRNeel Movie Budget: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో ఓ భారీ పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌నీల్‌(NTRNeel) అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు డ్రాగన్‌ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. కేజీయఫ్, సలార్‌ వంటి చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్‌ తెరకెక్కుతున్న సినిమా ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది గ్రాండ్‌గా లాంచ్‌ అయిన ఈ చిత్రం గురువారం (ఫిబ్రవరి 20) నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ని మొదలెట్టింది.

నిన్న రామోజీ ఫిలిం సిటీలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో షూటింగ్‌ని ప్రారంభించారు. దీనిపై స్వయంగా మూవీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ వెల్లడించారు. ఈమేరకు షూటింగ్‌ సెట్లోని ఫోటో కూడా రిలీజ్‌ చేశారు. అయితే తొలి సన్నివేశాన్ని భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌తో ప్లాన్‌ చేశాడు ప్రశాంత్‌ నీల్‌. దాదాపు మూడు వేల మందితో ఈ యాక్షన్‌ సీన్‌ చిత్రీకరించారట. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగనుందని తెలుస్తోంది. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో ఓల్డ్‌ కోలకత్తా థీమ్‌లో ప్రత్యేకంగా సెట్‌ వేసి అక్కడ షూటింగ్‌ని ప్రారంభించారు. ఎన్టీఆర్‌ మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని సినీవర్గాలు నుంచి సమాచారం.

ఇందులో తారక్‌ మునుపెన్నడు చూడని సరికొత్త మాస్‌ లుక్‌లో విభిన్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో కన్నడ భామ, సప్త సాగరాలు దాటి ఫేం రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటించనుందని టాక్‌. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 360 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందించనున్నాడు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్‌ తన బాలీవుడ్‌ డెబ్యూ చిత్రం వార్‌ 2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దాదాపు ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి ఎన్టీఆర్‌నీల్‌ షూటింగ్‌ సెట్లోకి ఎన్టీఆర్‌ అడుగుపెట్టనున్నాడని సమాచారం.

Exit mobile version
Skip to toolbar