Adhurs Movie: వివి వినాయక్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ అదుర్స్ చిత్రం మళ్లీ విడుదలకు సిద్ధంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం విడుదలవుతోంది. నవంబర్ 18, 2023న, అదుర్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మళ్లీ విడుదల కానుంది.
యాక్షన్ తో పాటు కామెడీ..(Adhurs Movie)
వల్లభనేని వంశీ, కొడాలి నాని నిర్మించిన ఈ చిత్రంలో నయనతార, షీలా కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఎన్టీఆర్ అదుర్స్‌లో తన ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను మరియు విమర్శకులను ఆకట్టుకున్నాడు. అతను చారి మరియు నరసింహ అనే రెండు భిన్నమైన పాత్రలను పోషించాడు. ఎన్టీఆర్, బ్రహ్మానందం ల మధ్య నడిచే కామెడీ సీన్లు అందరినీ ఆకట్టుకున్నాయి. వినాయక్ యాక్షన్ చిత్రాలు మాత్రమే కాదు చక్కటి కామెడీ కూడా చేయగలడనే కామెంట్లు ఈ చిత్రం విడుదలయ్యాక వచ్చాయి. యాక్షన్ తో పాటు కామెడీ కలబోసిన అదుర్స్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 13 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదల కానున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
మరోవైపు, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన రాబోయే చిత్రం దేవర కోసం పని చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.