Birla Daughter gifted Brand New Lamborghini Car to Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌కి బిర్లా వారసురాలు సర్‌ప్రైజ్ చేశారు. జాన్వీకి లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. ముంబైలోని జాన్వీ నివాసానికి ఈ కారును పంపించారు. ఈ లగ్జరీ పర్పుల్ కలర్ లంబోర్గిని నెటిజన్స్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే దీనిపై ఇంతవరకు జాన్వీ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. కారుతో అనన్య మరో గిఫ్ట్ సైతం అందులో ఉంచారు. దానిపై ‘ప్రేమతో నీ అనన్య’ అని రాసి ఉంది.
ఎవరీ అనన్య బిర్లా
అయితే జాన్వీ నివాసాని కారు వెళ్తోన్న దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతున్నాయి. బిర్లా వారసురాలు అన్యన్య బిర్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కూతురు, క్రికెటర్ ఆర్యమాన్ బిర్లా సోదరే అనన్య. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్లలో ఆమె ఒకరు. అతి చిన్న వయసులోనే ఆమె వ్యాపారరంగంలోకి అడుగుపెట్టారు.
17 ఏళ్ల వయసులోనే వ్యాపారంలోకి
17 ఏళ్ల వయసులోనే స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన మొదటి సంస్థ స్థాపించార అనన్య. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మైక్రోఫైనాన్స్ కంపెనీలో ఇది ఒకటిగా ఉంది. వ్యాపారవేత్తగానే కాదు సింగర్‌గాను అనన్య తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. పలు ప్రైవేట్ అల్బమ్స్‌లో పాటలు పాడి ఆకట్టుకున్నారు. ఇండస్ట్రీలో జాన్వీతో ఆమె మంచి సన్నిహితం ఉంది. ఇద్దరు కూడా మంచి స్నేహితులని టాక్. అయితే అనన్య తన వ్యాపారాన్ని విస్తరించేందుకు సౌందర్య ఉత్పత్తుల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు.
జాన్వీతో వ్యాపార ఒప్పందం
త్వరలోనే అనన్య సొంతంగా సౌందర్య ఉత్పత్తులతో పాటు పర్‌ఫ్యూమ్ బ్రాండ్‌ని లాంచ్ చేయబోతోంది. అయితే దీనికి ఎంటార్స్‌మెంట్ కోసం జాన్వీతో ఒప్పందం చేసుకుందట. తన సౌందర్య ఉత్పత్తులకు జాన్వీ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. తన బ్రాండ్ కోసం వర్క్ చేస్తున్నందుగా ప్రశంసంగా అనన్య జాన్వీకి ఈ లగ్జరీ లంబోర్గిని కారు కానుక ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌పై జాన్వీ నుంచి ఎలాంటి ప్రటకన లేదు. ఈ కారు ధర దాదాపు రూ. 4 కోట్ల నుంచి రూ.5 కోట్లు ఉంటుందని సమాచారం.