Site icon Prime9

Prasanth Varma: పాన్ ఇండియా హీరోతో ప్రశాంత్ వర్మ మూవీ, మోక్షజ్ఞతో సినిమా లేనట్టేనా?

Prasanth Varma and Mokshagna Nandauri Movie Update: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సింబా వచ్చేస్తున్నాడంటూ మోక్షజ్ఞ ఎంట్రీ అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. బాలయ్య వారసుడిని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను ప్రశాంత్ వర్మ తీసుకున్నారు. ఇందుకు మోక్షజ్ఞ కోసం అదరిపోయే కథ కూడా రెడీ చేశాడు. మోక్షజ్ఞ కూడా ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన లుక్స్ కూడా షేర్ చేశాడు ప్రశాంత్ వర్మ.

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా అంతా అయిపోయింది. ఇక పూజ కార్యక్రమంతో ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసి అధికారిక ప్రకటన ఇవ్వాలని మూవీ టీం నిర్ణయించుకుంది. ఇక సినిమాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఫూర్తి చేసుకుని కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే సడెన్ గా ఈ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడింది. పూజా కార్యక్రమం రేపు అనగా మోక్షజ్ఞ ఆరోగ్యం బాగాలేదంటూ బాలయ్య ప్రశాంత్ వర్మకు ఫోన్ చేయడం ప్రాజెక్ట్ కు బ్రేక్ పడింది. అయితే వాయిదా పడిందా? రద్దయ్యిందనేది క్లారిటీ లేదు. కానీ, ఇక ఈ ప్రాజెక్ట్ ఉండే చాన్స్ లేదంటూ సినీవర్గాల్లో గుసగుసల వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధంచిన ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అంతా అదే నిజమని ఫిక్స్ అయిపోతున్నారు. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా మోక్షజ్ఞ మూవీ రానుంది. అయితే, ఈ సినిమా నుంచి ప్రశాంత్‌ దాదాపు తప్పుకున్నట్లే అని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన కూడా రానుందట.మోక్షజ్ఞతో మూవీకి బ్రేక్ పడటంతో ప్రశాంత్ వర్మ ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. ప్రభాస్ తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఇప్పటికే ఈ స్టోరీని ప్రభాస్ కు వినిపించాడట, దీనికి డార్లింగ్ కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయని సమాచారం. ప్రశాంత్ వర్మతో సినిమా అనగానే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటే.. సూపర్ హీరోలు, ఇతీహసాలు, పురాణాల అద్బుతం చేస్తాడు. ఇలాంటి కథలు ప్రభాస్ కు బాగా కలిసోచ్చాయి. ప్రశాంత్ వర్మ లాంటి యంగ్ సెన్సేషన్ ప్రభాస్ లాంటి కటౌట్ కలిస్తే ఇక ఆ చిత్రం ఏ రేంజ్ ఉంటుందో అభిమానులు, ప్రేక్షకులు అంచనాలు వేసుకుంటు మురిసిపోతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.

Exit mobile version
Skip to toolbar