Delhi Capitals Recreates Ram Charan Peddi Shot: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐపీఎల్ మేనియా కొనసాగుతుంది. ఎక్కడ చూసిన ఐపీఎల్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలే దర్శనం ఇస్తున్నాయి. జట్లన్ని గెలుపు మీదా.. మాదా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇక తమ సత్తా ఏంటో చూస్తారా? అంటూ ఢిల్లీ క్యాపిటల్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్‌తో ఓ స్పెషల్ వీడియోను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్, మూవీ లవర్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది.
SRH Vs DC పోరు
ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఈ వీడియో చూసి తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాతో ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా ఇవాళ హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (SRH Vs DC) మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ DCకి కీలకం కానుంది. 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్‌కి వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. ఇక పది మ్యాచుల్లో కేవలం మూడు మాత్రమే గెలిచి సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. దీంతో నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది. ఈ క్రమంలో తెలుగువారిని మెప్పించేందుకు DC సరికొత్త ఆలోచన చేసింది.
పెద్ది షాట్ రీక్రియేషన్
ఈ మేరకు రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి ఇటీవల విడుదలై గ్లింప్స్‌లోని చరణ్ సిగ్నేచర్ షాట్‌ని రీక్రియేట్ చేసింది. షాట్ మాత్రమే కాదు డైలాగ్‌ని సైతం ఉపయోగించి మెగా ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. “ఒకటే పని చేసేనాకి, ఒకేలాగా బతకేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకుకు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయ్యాలా. పుడతామేంటి మల్లీ” గ్లింప్స్‌ని డిల్లీ క్యాపిటల్స్ తమ వీడియోలో వాడి, రామ్ చరణ్ సిగ్నేచర్ షాట్ రీ క్రియేట్ చేశారు. క్రికెట్ సమీర్ రజ్వీ.. రామ్ చరణ్ స్టైల్లో సిక్సర్ కొట్టాడు. ఈ వీడియోను Delhi Capital తమ ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేస్తూ.. ‘ఈ షాట్‌ని మీకంటే బాగా ఎవరూ చేయలేరు రామ్ చరణ్ గారు. ‘పెద్ది’ టీంకి ఆల్ ది బెస్ట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
No one can pull it off better than you, @AlwaysRamCharan 🏏
All the best for #Peddi 💙❤️
PS: Ekke kaam karne ko aayein hain. We’ll be prepared 😄 https://t.co/HiXRyeo7ih
— Delhi Capitals (@DelhiCapitals) May 5, 2025
రామ్ చరణ్ ఏమన్నారంటే
ఇక ఈ వీడియోపై రామ్ చరణ్ స్పదించాడు. ఈ వీడియోను రీషేర్ చేస్తూ .. ఢిల్లీ క్యాపిల్స్కి ధన్యవాదాలు తెలిపారు. మా పెద్ది సినిమాలోని ఫస్ట్ షాట్ చాలా అద్భుతంగా రీ క్రియేట్ చేశారంటూ ఢిల్లీ టీంని అభినందించారు. కాగా రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో క్రికెట్ ఆట ప్రత్యేకతను చూపించబోతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కన్నడ నటుడు శివ రాజ్ కుమార్, జగపతి బాబులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Thank you ❤️ @DelhiCapitals for the Massive Recreation of #PeddiFirstShot ❤️🔥🏏
Wishing you all the best for today's Match 🤝
Just be prepared @SunRisers might comeback stronger.😃💪🏼 pic.twitter.com/4s7qQNmqGW
— Ram Charan (@AlwaysRamCharan) May 5, 2025