Site icon Prime9

KP Chowdary Drugs Case : కబాలీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో ముగిసిన విచారణ.. లిస్ట్ లో 12 మంది.. వీళ్ళకి కూడా లింకు ఉందా!

interesting details about kp chowdary drugs case

interesting details about kp chowdary drugs case

KP Chowdary Drugs Case : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి మూవీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పోలీసులు ఈ కేసులో చౌదరితో విచారణ పూర్తి చేశారు. కాగా ఈ విచారణలో భాగంగా పలు సంచలన విషయాలు వెల్లడయినట్లు సమాచారం అందుతుంది. మొత్తం 2 రోజుల పాటు సాగిన ఈ విచారణలో 12 పేర్లు మాత్రమే ఇప్పటి వరకు బయటికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు.  అందులో టాలీవుడ్ నుంచి తెలుగు బిగ్‌బాస్‌ ఒక సీజన్‌లో పాల్గొన్న హీరోయిన్‌తో పాటు తెలుగులో స్పెషల్ సాంగ్స్‌ చేసిన హీరోయిన్‌తో కేపీ చౌదరి వందల సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ విషయం తెలుగు చిత్ర సీమలో హాట్ టాపిక్ గా మారింది.

అదే విధంగా చౌదరితో పలువురు ఫేమస్ ఆర్టిస్టులు దిగిన ఫోటోలు అతని ఫోన్లో లభ్యమయ్యాయి. వారిలో ప్రముఖ సీనియర్‌ నటి సురేఖా వాణి సన్నిహితంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమెతో పాటు తన కూతురితో కూడా కేపీ చౌదరి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. డ్రగ్స్‌ కేసులో వీరి పేర్లు కూడా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక విచారణలో భాగంగా కేపీ బ్యాంక్‌ లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలించారు. ఇందులో భాగంగా 11 అనుమానాస్పద లావాదేవీలు గుర్తించారు. వీరితో పాటు రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేష్‌, బెజవాడ భరత్‌, శ్వేత, ఠాగూర్‌ ప్రసాద్‌ సహా మరికొన్ని పేర్లు కేపీ చౌదరి డ్రగ్స్ కన్స్యూమర్ లిస్ట్‌లో ఉన్నట్లు తెలిసింది.

అయితే ఈ కేసులో పోలీసులు తన మీద ఫాల్స్ అలగేషన్స్ వేస్తున్నారని చౌదరి (KP Chowdary Drugs Case) ఆరోపిస్తున్నారు. మరోవైపు తాను సినిమా వాళ్లెవరికీ డ్రగ్స్‌ సప్లై చేయలేదని కేపీ చెప్పుకొచ్చారు. ఫోన్‌లో నెంబర్‌ ఉన్నంత మాత్రాన పెడ్లర్‌ని కాదన్నారు. ‘ నేను డ్రగ్స్‌ తీసుకుంటా.. ఆ డ్రగ్స్‌ నాకోసమే. సెలబ్రెటీలు ఎవరికీ నేను డ్రగ్స్‌ ఇవ్వలేదు’ అని చెప్పుకొచ్చాడు కేపీ చౌదరి. మరి ఈ వ్యవహారంలో ఇంకెంత మంది పేర్లు బయటికి వస్తాయో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version