Site icon Prime9

Ilayaraja Notice to Good Bad Ugly Makers: రూ. 5 కోట్లు డిమాండ్.. మైత్రీ మూవీ మేకర్స్‌కి ఇళయారాజా నోటీసులు!

Ilayaraja Sent legal Notice to Good Bad Ugly Makers: తమిళ స్టార్‌ హీరో అజిత్‌ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ మూవీ ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. తెలుగు, తమిళంలో ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్‌ రావడం లేదు. కానీ తమిళంలో మాత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ఐదు రోజుల్లోనే ఈ సినిమా వందకోట్ల క్లబ్‌లో చేరింది.

 

వివాదంలో గుడ్ బ్యాడ్ అగ్లీ..

అయితే ఇప్పుడు ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. మ్యూజిక్ మాస్ట్రో, లెజెండరి సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ సినిమా టీంకి నోటీసులు పంపారు. రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తూ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ నిర్మాతలకు లీగల్‌ నోటిసులు ఇచ్చారు. అంతేకాకుండ ఏడు రోజుల్లోగా తనకు క్షమాపణలు చెప్పాలని కూడా పేర్కొన్నారు. కాగా గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ మూవీలో చాలావరకు పాత పాటలను ఉపయోగించిన సంగతి తెలిసిందే. వింటేజ్‌ ఫీల్‌ కోసం, ఆడియన్స్‌ని అట్రాక్ట్‌ చేసేందుకు చేసిన ఈ ప్రయత్నం బాగానే వర్కౌట్‌ అయ్యింది. వీటిని మంచి రెస్పాన్స్‌ వస్తుంది. అయితే ఇందులో తను స్వరపరిచిన మూడు పాటలను ఉపయోగించారని తాజాగా ఆయన ఆరోపించారు.

 

రూ. 5 కోట్లు డిమాండ్..

అనుమతి లేకుండ తన స్వరపరిచిన పాటలు ఉపయోగించినందుకు ఆయన ఈ మూవీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపీ రైట్‌ కింద నష్టపరిహారంగా రూ. 5 కోట్లు డిమాండ్‌ చేశారు. అలాగే తన అనుమతి లేకుండ మూడు పాటలు ఉపయోగించినందుకు తనకు క్షమాపణలు చెప్పాలని వారం రోజుల గడవు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహరం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించిన ఆయన తరచూ వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. గతంలోనూ ఆయన పలు సినిమాలకు నోటీసులు ఇచ్చారు. మంజుమ్మెల్‌ బాయ్స్‌, కూలీ వంటి తదితర చిత్రాలకు ఆయన నోటీసులు ఇచ్చారు. తాజాగా అజిత్‌ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ మూవీకి నోటీసులు ఇచ్చి మరోసారి ఇళయారాజా వార్తల్లో నిలిచారు.

Exit mobile version
Skip to toolbar