IIFA Awards 2023: ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా 2023) అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. దుబాయ్ రాజధాని అబుదాబి లో జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్ కు చెందిన సినీ సెలబ్రెటీలు పాల్గొన్నారు. సల్మాన్ ఱాన్, విక్కీ కౌశల్, రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహి, ఊర్వశి రౌటులా, విజయ్ వర్మ, అభిషేక్ బచ్చన్, వరుణ్ దావన్ లాంటి స్టార్స్ సందడి చేశారు.
ఈ అవార్డు ఫంక్షన్‌లో గంగూబాయి సినిమా 3 అవార్డులు గెలుచుకుంది. భూల్ భూలయ్య-2 సినిమాలో టైటిల్ సాంగ్‌కు సీజర్ గోన్సాల్వేస్, బోస్కో మార్టిన్స్ ఉత్తమ కొరియోగ్రాఫీ విభాగంలో అవార్డులు అందుకున్నారు. ఈ సినిమాకు బెస్ట్ సౌండింగ్ విభాగంలోనూ అవార్డు వరించింది.
అజయ్ దేవగణ్ దృశ్యం-2 కు బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో సందీప్ ఫ్రాన్సిస్ అవార్డు గెలుచుకున్నాడు. స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో బ్రహ్మస్త్ర సినిమాను అవార్డు వరించింది. ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ సౌండ్ మిక్సింగ్ విభాగంలో విక్రమ్ వేద సినిమాలోని మోనికా ఓ మై డార్లింగ్ పాటకు అవార్డు దక్కింది.