Hrithik Roshan About War 2 Update on May 20th: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే వచ్చేస్తోంది. ఈసారి నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్ మాములుగా ఉండదు. సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దేవర 2, వార్ 2, ఎన్టీఆర్‌నీల్ (NTRNeel Movie). ఇప్పటి వరకు ఈ సినిమాలకు సంబంధించి ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. ముఖ్యంగా తారక్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం వార్ 2పై ఓ రేంజ్‌లో బజ్ నెలకొంది.
ఈ మూవీకి సంబంధించి అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారందరికి ఓ అదిరిపోయే సర్‌ప్రైజింగ్ ట్వీట్ వదిలారు బాలీవుడ్ గ్రీకు వీరుడు, సూపర్ స్టార్ హృతిక్ రోషన్. మే 20 వార్ 2 నుంచి వచ్చే అప్‌డేట్‌ను ఎన్టీఆర్ సైతం అంచన వేయలేడట. ఇదే విషయాన్ని చెబుతూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘హే తారక్, ఈ ఏడాది మే 20 కోసం రెడీ అవుతున్న సర్‌ప్రైజ్ ఏలా ఉండబోతుందో ఆలోచించావా? నేను ఖచ్చితంగా చెప్పగలను అసలేం స్టోర్ చేస్తున్నారో అది నువ్వు ఊహించలలేవు. దాని కోసం సిద్ధంగా ఉన్నావా?’ అంటూ తన పోస్ట్‌లో రాసుకోచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ నందమూరి ఫ్యాన్స్‌లో మరింత ఉత్సహన్ని పెంచుతోంది.
ఆ రోజు ‘వార్ 2’ నుంచి వచ్చే అప్‌డేట్‌ను మేకర్స్ ఏ రేంజ్‌లో ప్లాన్ చేశారా? అని అంచనాల్లో మునిగితేలుతున్నారు. ఆ రోజు బాలీవుడ్, టాలీవుడ్‌లో పండగ మామూలుగా ఉండదని, సోషల్ మీడియా మాధ్యమాలు షేక్ అవ్వాల్సిందే అంటున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని జరుపుకుంటుంది. బ్రహ్మస్త్ర ఫేం ఆయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో హృతిక్, ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో తారక్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడని టాక్. యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2
— Hrithik Roshan (@iHrithik) May 16, 2025