Honey Rose Case: సినీ నటి హనీరోజ్ వేధింపుల కేసులో ప్రముఖ వ్యాపారవేత్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తనని వేధిస్తున్నారని, అలాగే ఒక ఒక వ్యాపారవేత్త కొంతకాలంగా తనని ఇబ్బంది పెడుతున్నాడని ఇటీవల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రముఖ గోల్డ్ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా హనీరోజ్ ఫిర్యాదు చేసినప్పటి నుంచి బాబీ చెమ్మనూరు పరారీలో ఉన్నారు. అతడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు బుధవారం వయనాడ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. వ్యాపారవేత్త బంగారు బాబీ చెమ్మనూరును అరెస్ట్ చేయడంతో తాను ప్రశాంతంగా ఉన్నానని అన్నారు హనీరోజ్. ఈ కేసు అంశాన్ని ఇప్పటికే తాను ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వద్దకు తీసుకువెళ్లానని ఆమె అన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరిపై తగిన చర్యలు తీసుకుంటామని సీఎం తనకు హామీ ఇచ్చినట్టు హనీరోజ్ పేర్కొన్నారు.
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తాను తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తనని ఉద్దేశిస్తూ డబుల్ మీనింగ్‌తో సోస్ట్స్ పెడుతున్నారన్నారు. మరికొందరు తనని అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని రెండు రోజులు క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక వ్యాపారవేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నట్టు స్పష్టం చేశారు. తాను వివరణాత్మక విమర్శలను స్వాగతిస్తాను.. కానీ కావాలని కించపరిచేలా, అవమానపరిచే కామెంట్స్‌ని భరించలేనన్నారు. ఒక వ్యక్తి కావాలని న్ను అవమానించడానికి ప్రయత్నిస్తున్నాడని తన లేఖలో హనీరోజ్ రాసుకొచ్చింది. తప్పుడు కామెంట్స్‌పై తాను సైలెంట్‌గా ఉంటుంటే.. ఆ వ్యాఖ్యలను నువ్వు స్వాగతిస్తున్నావా? అని అడుగుతున్నారని, వాటి వల్ల తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని తెలిపారు.
ఎవరీ బాబీ చెమ్మనూరు
బాబీ చెమ్మనూరు ప్రముఖు బంగారం వ్యాపారవేత్త. గతంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ డిగో మారడోనాను కొచ్చికి తీసుకువచ్చి తన జువెల్లరీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా చేవారు. దీంతో బాబీ ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అప్పటి నుంచి ప్రముఖ వ్యాపారవేత్తల్లో అతడు ఒకడిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో తన వ్యాపారం ప్రమోషన్స్ కోసం హనీరోజ్‌ను అతడు ఆహ్వానించాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె వెల్లలేకపోయింది. దీంతో ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్ట్స్ చేయిస్తున్నట్టు ఆమె పోలీసులకు ఆరోపించింది.