Site icon Prime9

JOKER 2: హాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న జోకర్ 2.. జోక్విన్‌ ఫోనిక్స్‌ ఫస్ట్ లుక్ రిలీజ్

hollywood actor Joaquin Phoenix First look in Joker 2 released by director todd philips

hollywood actor Joaquin Phoenix First look in Joker 2 released by director todd philips

JOKER 2: జోకర్ అనగానే ఓ ముఖం మన కళ్లముందు కనిపిస్తుంది. సీరియస్ మరియు హాస్యాస్పదం కలగలిపిన ఆ ఫేస్ ప్రపంచ బాక్సాఫీసులను షేక్ చేసింది. మూడేళ్ల క్రితం హాలీవుడ్‌ హీరో జోక్విన్‌ ఫోనిక్స్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన జోకర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఫిల్మ్ అవార్డ్ అయిన ఆస్కార్ అవార్డులు కూడా సాధించింది.

ఈ సినిమాలో మ్యూజిక్ అయితే కుర్రకారును ఉర్రాతలూగించిందని చెప్పవచ్చు. హీరో జోక్విన్‌ ఫోనిక్స్‌ క్యారెక్టర్ కి యావత్త సినీ ప్రపంచం ఫిదా అయ్యింది. సోషల్ మీడియాలో కూడా ఈ క్యారెక్టర్ మరియు మ్యూజిక్ బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన ప్రజలకు ఆ చిత్ర దర్శకుడు టాడ్ ఫిలిప్స్ శుభవార్త చెప్పాడు.

కొన్ని నెలల క్రితం ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశాడు దర్శకుడు. హీరో జోక్విన్‌ ఫోనిక్స్‌ తోనే జోకర్ 2 సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా జోకర్ 2 షూటింగ్ మొదలుపెట్టినట్టు డైరెక్టర్ తెలిపాడు. ఈ మేరకు షూట్ లోని ఒక స్టిల్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జోకర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘జోకర్‌: ఫోలీ ఏ డీక్స్‌’ అనే పేరుని పెట్టారు. ఇక ఈ జోకర్ 2 సినిమాని 2024లో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అలాగే ఈ సినిమాలో స్టార్ పాప్ సింగర్ లేడీగాగా ఓ కీలక పాత్రలో నటించనుంది. దీంతో ఈ సినిమాపై ప్రజల్లో భారీ అంచనాలు పెరిగాయి. జోకర్ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాను ఈ సారైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాషల్లోకి రీమేక్ చేసి విడుదల చేస్తారా..? లేదా అనేది 2024 వరకు వేచి చూడాల్సిందే..!

ఇదీ చదవండి: ప్రభాస్‌ని బాలకృష్ణ ఏ ప్రశ్నలు అడగాలో మీరే చెప్పండి : ఆహా

Exit mobile version