Al Pacino: గాడ్ ఫాదర్ అంటే చాలు తెరపై గుర్తొచ్చేది ఆయన ఒక్కరే. ఆయన మరెవరో కాదు హాలీవుడ్ సీనియర్ నటుడు అల్ పాసినో. గాడ్ ఫాదర్ సినిమాలతో యావత్ ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు 82 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రి కాబోతున్నారు. అదేంటి ఈ వయసులో తండ్రి కావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. 82 ఏళ్ల అల్ పాసినో.. నిర్మాతగా కొనసాగుతున్న 29 ఏళ్ల నూర్ అల్ఫల్లాతో గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ప్రస్తుతం నూర్ అల్ఫల్లా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అల్ పాసినో ప్రతినిధి ఓ మ్యాగజైన్‌కు వెల్లడించారు.
82 ఏళ్ల వయస్సులో 29 ఏళ్ల గార్ల్ ఫ్రెండ్(Al Pacino)
మాజీ ప్రియురాలు మీటల్ దోహన్‌తో బ్రేకప్ అయిన వెంటనే అల్ఫాల్లాతో పాసినో డేటింగ్తో ఉన్నట్టు హాలీవుడ్ కోడై కూసింది. కాగా పాసినోతో డేటింగ్‌కు ముందు రోలింగ్ స్టోన్స్ సింగర్ మిక్ జాగర్‌తో అల్ఫల్లా డేటింగ్‌లో ఉన్నారు. ఏడాదికిపైగా సాగిన వారి బంధానికి 2018లో ముగింపు పలికారు అల్ఫల్లా. ఆ తర్వాత 2019లో నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌ఉడ్‌తో కలిసి ఆమె చెట్టపట్టాలేసుకుని తిరిగినా.. తమ మధ్య అలాంటిదేమీ లేదని చెప్పారు. అల్ఫల్లాకు మొదటి సంతానం కాగా.. పాసినో నాలుగో సారి తండ్రవుతున్నాడు. అల్ పాసినోకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉన్నారు. యాక్టింగ్ టీచర్ అయిన జాన్ టరంట్‌తో కుమార్తె జూలీ మేరీ (33), మాజీ ప్రియురాలు బెవెర్లీ డీఆంగెలోతో 22 ఏళ్ల కవలలు ఉన్నారు.