Site icon Prime9

Vijay Antony : హీరో విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదం.. ఆత్మహత్య చేసుకున్న కుమార్తె మీరా

hero vijay antony daughter meera suicide news got viral

hero vijay antony daughter meera suicide news got viral

Vijay Antony : ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. నకిలీ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చినా కానీ.. 2016 లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ మూవీ ఎంత సన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు లో కూడా రికార్డ్ కలెక్షన్లు అందుకుంది. కాగా ఇప్పుడు బిచ్చగాడుకు కొనసాగింపుగా వచ్చిన ‘బిచ్చగాడు 2’ తో విజయ్ ఆంటోనీ మరో భారీ హిట్ అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల పరంగా ఆయన కెరీర్ హయ్యస్ట్ గ్రాస్ నమోదు చేసింది. అయితే ఊహించని రీతిలో తాజాగా వారి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుందని తెలుస్తుంది.

విజయ్ ఆంటోనీ కుమార్తె పేరు మీరా. ప్రస్తుతం ఆమె వయసు 16 ఏళ్ళు.. కాగా చెన్నైలో గల ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నారు. విజయ్ ఆంటోనీ కుటుంబం డిడికె రోడ్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ఇంట్లో తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో మీరా ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. చెన్నైలోని తేనాంపేట పోలీసులు మీరా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిటీలోని ఓమంతురార్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరా ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. చిన్న వయసు లోనే క్షణికావేశంతో మీరా చేసిన పనికి వారి కుటుంబ సభ్యులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలువురు ప్రముఖులు వారి సంతాపాన్ని తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

 

 

కాగా ఇటీవల బిచ్చగాడు 2 షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోనీకి కూడా తీవ్ర ప్రమాదం జరిగింది. ఇక పరిస్థితులు ఇప్పుడే మళ్ళీ మామూలుగా మారాయి అనుకునే తరుణంలో వారి ఇంట తీవ్ర విషాదం జరగడం అందరినీ కలచివేస్తుంది. విజయ్ ఆంటోని తొలుత సంగీత దర్శకుడిగా ఆయన పరిచయం అయినా సరే… కథానాయకుడిగా వరుస విజయాలు అందుకున్నారు. శ్రీకాంత్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘మహాత్మ’ సినిమాకు ఆయన సంగీతం అందించారు. ఆ తర్వాత రవితేజ ‘దరువు’ సినిమాకు కూడా సంగీతం అందించారు. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్నారు.

Exit mobile version