Site icon Prime9

Miss Shetty MR Polishetty : “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” గురించి హీరో నిఖిల్ – నవీన్ పోలిశెట్టి ఆసక్తికర ట్వీట్స్.. అడ్రస్ పెట్టు అంటూ

hero nikhil and naveen polishetty tweets about miss shetty mr polishetty goes viral

hero nikhil and naveen polishetty tweets about miss shetty mr polishetty goes viral

Miss Shetty MR Polishetty : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన మూవీ “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేశారు. నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క శెట్టి ఫేమస్ షెఫ్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించింది.  సెప్టెంబ‌ర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్ర‌మంలో త‌న‌కు మంచి విజ‌యాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ ఇటీవ‌ల న‌వీన్ పొలిశెట్టి ఓ ట్వీట్ చేశాడు.

అయితే ఈ ట్వీట్‌పై తాజాగా యంగ్ హీరో నిఖిల్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ మేరకు ఆ ట్వీట్ లో..  ‘హేయ్ మామ‌.. నువ్వు మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి సినిమాతో విజ‌యం సాధించడం చాలా సంతోషంగా ఉంది. అయితే.. నేను వియ‌త్నాంలో ఉండ‌డం వ‌ల్ల నీ సినిమాను చూడ‌లేక‌పోయా. ఇక్క‌డ ఓ స్పెష‌ల్ షో వేయించొచ్చుగా.. మీ యూనిట్ కి నా అభినంద‌న‌లు.. అంటూ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ కి నవీన్.. “ధ‌న్య‌వాదాలు బ్రదర్.. వియ‌త్నాంలోనా..? త‌ప్ప‌కుండా షో వేయిస్తా.. అడ్ర‌స్ పెట్టు.. నువ్వు ముందు అడ్ర‌స్ పెట్టు .. నువ్వు ఎప్పుడు ఇండియాకు వ‌స్తావ్‌..? మూవీ గురించి నీ అభిప్రాయం తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నా.. అంటూ రిప్లై ఇచ్చాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి ట్వీట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

 

 

 

అలానే అనుష్క, నవీన్ కెమిస్ట్రీ ఆక‌ట్టుకోగా, కామెడీకి జ‌నాలు ఫిదా అయ్యారు. సినీ విమర్శకుల నుంచి ప్ర‌శంస‌లు సైతం ద‌క్కాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ బాక్సాఫీస్ వ‌ద్ద సైతం ఈ సినిమా (Miss Shetty MR Polishetty) మంచి క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ఈ గురువారం ప్రత్యేక షో వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం గురించి అనుష్క స్వయంగా ఒక వీడియో ద్వారా తెలియజేసింది. సినిమాని ఆదరిస్తునందుకు అందరికి థాంక్యూ చెప్పింది. ఇక ఆంధ్రా అండ్ తెలంగాణలో కొన్ని సెలెక్ట్ చేసిన థియేటర్స్ లో ఆడవాళ్ళకి మాత్రం అనుష్క ప్రత్యేక షో వేయిస్తున్నట్లు వెల్లడించింది. అందుకు సంబంధించిన థియేటర్స్ లిస్ట్ ని కూడా రిలీజ్ చేసింది.

 

 

Exit mobile version