Hari Hara Veeramallu Third Single Release: అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రం నుంచి నేడు పవర్ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా ఈ పాటను రిలీజ్ చేసింది టీం. ‘సలసల మరిగే నీలోని రక్తమే..’ అంటూ సాగే ఈ పాట గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. పోరాట యోధుడిగా వీరమల్లు పాత్ర, ఆయన తెగువను వివరిస్తూ ఈ పాట సాగింది. ప్రస్తుతం ఈ మూడో సింగ్ యూట్యూబ్‌లో మారుమ్రోగుతుంది.
కాగా పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. పవన్ కళ్యాన్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిలీజ్ అవుతున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్లో స్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత జూన్ 12న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచింది మూవీ టీం. ఇందులో భాగంగా ఈ చిత్రం నుంచి ఇవాళ థర్డ్ సింగిల్‌ని రిలీజ్ చేసింది.
ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్, రెండు పాటలు, స్పెషల్ వీడియోలు మూవీపై మంచి బజ్ పెంచాయి. తాజాగా విడుదలైన ఈ థర్డ్ సింగిల్ అభిమానులకు, సంగీత ప్రియులు గూస్‌బంప్సే అనేలా ఉంది. అసుర హననమ్ అంటూ సాగే ఈ పాటకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇందులో పవన్ పోరాట యోధుడిగా తన శౌర్యం చూపించారు. ఈ పాట బ్యాక్‌డ్రాప్‌లో శత్రువులపై యుద్దం చేస్తున్నట్టు చూపించారు.
కాగా ఎమ్‌ఎమ్ కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈపాటకు రాంబాబు ఘోస్లా సాహిత్యం అందించగా.. ఐరా ఉడిపి, కాలభైరవ, సాయి చరణ్ భాస్కరుణి, లోకేశ్వర్, హైమత్ మహమ్మద్‌లు ఆలపించారు. ఇందులో పవన్ కళ్యాణ్ 18వ శతాబ్ధంలోని పోరాట యోధుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతికథానాయకుడిగా కనిపించనున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 12న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.