Hansika Motwani Horror Thriller Guardian Telugu Version In OTT: హీరోయిన్ హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కని సినిమా ‘గార్డియన్’. సబరి, గురు సరవనన్ దర్శకత్వం వహించిన ఈసినిమా తెలుగు వెర్షన్ తాజాగా ఓటీటీకి వచ్చింది. మొదట తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది మార్చి 8న తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఉలిక్కిపడే కథనంతో, కట్టిపడేసే విజువల్స్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో గార్డియన్ తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకుచ్చింది. భవానీ మీడియా ద్వారా ఆహా ఈ సినిమాను తెలుగులో స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చింది. ఇందులో దెయ్యం పాత్రలో హన్సిక తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సామ్ సి.ఎస్ అందించిన హారర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కేఏ సక్తివేల్ సినిమాటోగ్రఫీ, ఎం తియాగరాజ్ ఎడిటింగ్ ప్రేక్షకులను అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని ఇచ్చింది.
గార్డియన్ కథ విషయానికి వస్తే..
ఓ ఆత్మ కథ చూట్టూ ఈ సినిమా సాగుతుంది. కొందరి వల్ల అన్యాయానికి గురైన మరణించిన ఓ యువతి ఆత్మగా మారుతుంది. వారిపై పగ తీర్చుకోవడానికి ఆత్మగా మారిన ఆమెకు హీరోహీరోయిన్లు సాయం చేస్తారు. చనిపోయిన ఆ యువతి ఎవరు? తనకు జరిగిన అన్యాయం ఏంటీ? ఆ ఆత్మకు హన్సికకు మధ్య సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.