Site icon Prime9

Posani Krishna Murali: పోసానికి ఊరట – ఎట్టకేలకు బెయిల్‌ మంజూరు

Posani Krishna Murali Gets Bail: ఎట్టకేలకు నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు అయ్యింది. సీఐడీ కేసులోనూ ఆయనకు కోర్టు బెయిల్‌ ఇచ్చింది. ఇటీవల పోసాని తరపు న్యాయవాది బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగగా శుక్రవారానికి వాయిదా వేశారు. తాజాగాఈ పిటిషన్‌పై విచారించిన గుంటూరు కోర్టు ఇరు వాదనలను పరిగణలోకి తీసుకుని ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.

గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, మంత్రి లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఏపీలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఏపీలోని పలుచోట్లు ఆయనపై ఐదు కేసులో నమోదు అవ్వడంతో ఏపీ సీఐడీ పోలీసులు గత నెల ఆయనను ఆరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఆయనకు రిమాండ్‌ విధించారు.

ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా కోర్టులో జ్యూడిషియల్ రిమాండ్‌ విధించారు. అలాగే ఈ కేసులో పోసానిని సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. విచారణ అనంతరం కూడా సీఐడీ అధికారులు పీటీ వీరెంట్‌ వేసి పోసానిని అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరు పరిచారు. అందులో భాగంగా గుంటూరు కోర్టు ఆయనకు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. మరోసారి పోసాని కస్టడీ కోసం సీఐడీ కోర్టు కోరింది. ఈ క్రమంలో ఆయనకు గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Exit mobile version
Skip to toolbar