Site icon Prime9

golden Sparrow Song: తమిళ సెన్సేషన్‌ గోల్డెన్‌ స్పారో సాంగ్‌ – ఇప్పుడు తెలుగులో

Golden Sparrow Telugu Lyrical Song: కోలీవుడ్‌ హీరో ధనుష్‌ హీరోగా మాత్రమే దర్శకుడిగానూ సక్సెస్‌ అందుకున్నాడు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన రాయన్‌ మూవీ తెరకెక్కింది. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళం, తెలుగులో విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో ఆయన నటనతో పాటు దర్శకత్వంలోపై కూడా ఫోకస్‌ పెట్టాడు.

ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో తమిళంలో ఇడ్లీ కడై సినిమా తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు యువ నటీనటులతో ‘నిలవకు ఎన్మేల్‌ ఎన్నాడి కోబం’ (తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా) మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవల గోల్డెన్‌ స్పారో పాట విడుదల చేశారు. తమిళంలో రిలీజైన ఈ పాటకు విశేష స్పందన వచ్చింది. హీరోయిన్‌ మాళవిక మోహన్‌ స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇచ్చిన ఈ పాటకు ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుటుంది.

Golden Sparrow Lyric Video (Telugu) | Dhanush | Priyanka Mohan | Pavish | Anikha | GV Prakash

దీంతో ఇప్పుడు ఈ పాటను తెలుగులో రిలీజ్‌ చేశారు మేకర్స్‌. గోల్డెన్‌ స్పారో అంటూ సాగిన ఈ పాటు తెలుగు ఆడియన్స్‌ని సైతం ఆకట్టుకంటుంది. కాగా అనిఖా సురేంద్రన్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, మథ్యూ థామ్‌, వెంకటేష్‌ మీనన్‌, రబియా కతూన్, రమ్య రంగనాత్‌ వంటి యువనటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. కస్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరిరాజా సమర్పణలో ఉండర్‌బార్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar