Gachibowli Police Registered Case on Actress KALPIKA: టాలీవుడ్ నటి కల్పికా గణేశ్‌పై కేసు నమోదైంది. గత నెల 29న ప్రిజం పబ్‌లో బిల్ పే చేయకుండా సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెపై పబ్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ప్రిజం క్లబ్ ఓనర్ దీప్ బజాజ్ ఫిర్యాదుతో నటి కల్పికపై 324(4),352,351(2) బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.
కాగా, పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ప్రిజం పబ్ నిర్వాహకులకు, ఆమెకు మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే కల్పిక ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినట్లు ప్రిజం పబ్ యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మే 29న కల్పిక ప్రిజం క్లబ్ వెళ్లగా.. రూ.2,200 బిల్ కట్టి కాంప్లిమెంటరీగా కేక్ ఇవ్వమని కోరిందని నిర్వాహకులు తెలిపారు. కేక్ ఇవ్వమని చెప్పడంతో వాగ్వాదానికి తెర లేపిందని చెప్పారు. మరోవైపు.. ప్రిజం క్లబ్ మేనజర్ తో పాటు సిబ్బంది తనపై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అత్యాచారం చేసేందుకు యత్నించారని కల్పిక సోషల్ వేదికగా తప్పుడు సమాచారం చేసిందని తెలిపారు. క్లబ్ లో సామగ్రిని సైతం ధ్వంసం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించిందని పలువురు అంటున్నారు. పోలీసుల ముందు అసత్య ఆరోపణలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కోర్టు అనుమతితో నటి కల్పికపై కేసు నమోదు చేశారు.