Site icon Prime9

Hit 2 Movie: మ్యూజిక్ మ్యాజిక్ క్రియేట్ చేసిన హిట్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో

urike urike song from hit 2 first single promo

urike urike song from hit 2 first single promo

Hit 2 Movie: అడివి శేష్ హీరోగా, మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా సైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హిట్ ది సెకండ్ కేస్. ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో సిద్ శ్రీరామ్, రమ్య బెహరా ఆలపించిన ఉరికే ఉరికే సాంగ్ ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు చిత్ర బృందం.

ఈ పాట వింటుంటేనే ఫీల్ గుడ్ మెలోడీగా అనుభూతి వస్తోంది. అందులోనూ సిద్ శ్రీరామ్ ఈ పాటకు అందించిన గాత్రం అయితే ఈ పాటను మరో వేరే లెవెల్ కు తీసుకెళ్లినట్లు ప్రోమో చూస్తేనే తెలుస్తుంది. ఈ సాంగ్ లో అడివి శేష్, మీనాక్షి చౌదరిల కెమిస్ట్రీ చూపరులను ఆకట్టుకుంటోంది. ఇక ప్రోమోనే ఇలా ఉంటే ఫుల్ సాంగ్ ఇంకెలా ఉంటుందో అనే క్యూరియాసిటీ ప్రేక్షకులలో రేకెత్తుతుంది. అందమైన విజువల్స్, అందుకు తగినట్లుగా ఉన్న మ్యూజిక్ తో ఈ పాట సినీలవర్స్ లో మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తుంది.

ఇదీ చదవండి: “డీడీఎల్‌జె” రీమేక్‌‏లో విజయ్ దేవరకొండ?

Exit mobile version