Site icon Prime9

Balagam: బలగం కథ వివాదంపై స్పందించిన వేణు ఎల్దండి.. ఏమన్నారంటే?

balagam

balagam

Balagam: బలగం సినిమా కథ వివాదంపై ఆ సినిమా దర్శకుడు.. వేణు ఎల్దండి స్పందించారు. ఈ కథ తనదేనంటూ ఓ వ్యక్తి వివాదం సృష్టించడం హాస్యాస్పదంగా ఉందని అన్నాడు. కాకి ముట్టుడు అనేది తెలంగాణ సంప్రదాయం మాత్రమే కాదని.. తెలుగు సంప్రదాయమని స్పష్టం చేశారు. ఆరేళ్లుగా ఎంతో శ్రమించి ఈ కథను తయారు చేసుకున్నానని చెప్పారు. ఈ విషయంలో తాను కూడా కోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు.

 

జబర్దస్త్ స్టార్ కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాను తెరకెక్కించారు.  కాగా ఈ సినిమా కథ తనది అంటూ, 2011లోనే ఈ కథ రాసుకున్నట్లు.. ప్రముఖ పత్రికలో పని చేస్తున్న గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీంతో నేడు ఈ వ్యాఖ్యలు పై స్పందిస్తూ దర్శకుడు వేణు మీడియా ముందుకు వచ్చాడు.

 

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా ఈ సినిమాలో నటించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి నిర్మించారు.. చిన్న సినిమాగా వచ్చినా.. పెద్ద ఎత్తున  ప్రమోషన్స్ చేశారు. ”నా కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఈ కథ రాసుకున్నట్లు వేణు తెలిపారు.

Exit mobile version