Site icon Prime9

Director Harish Shankar : ప్రముఖ రిపోర్టర్ కి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చి నోరు మూయించిన డైరెక్టర్ హరీష్ శంకర్..

director-harish-shankar-counters to reporter suresh kondeti

director-harish-shankar-counters to reporter suresh kondeti

Director Harish Shankar : సాధారణంగా ఒక విషయాన్ని వ్యక్తపరచడానికి, ప్రజలకు తెలియజేయడానికి మీడియా అనేది మాద్యమంగా ఉపయోగపడుతుందో అదే విధంగా ప్రశ్నించడానికి కూడా ఉంటుంది. మీడియా ప్రధాన మూడు సూత్రాలలో ఒకటైన ఎంటర్టైన్ విషయానికి వస్తే చిత్ర రంగం అందులో ఉంటుంది. సినిమాల విషయంలో..  సినిమాకి సంబంధించిన విషయంలో ప్రెస్ మీట్ లు నిర్వహించడం సర్వ సాధారణం. చిన్న సినిమా నుంచి పాన్ ఇండియా .. పాన్ వరల్డ్ మూవీల వరకు ప్రెస్ మీట్ లు, ఇంటర్వ్యూ లు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మన టాలీవుడ్ విషయానికి వస్తే.. ప్రెస్ మీట్స్ ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి.

ఈ మీట్ లు అన్నింటికీ ఒక సీనియర్ జర్నలిస్ట్ బ్యాచ్ ఉంటుంది. సోదర సమానులైన వారిలో కొందరు ఏం అడుగుతారో.. ఎందుకు అడుగుతారో తెలీదు.. మరి ముఖ్యంగా గత కొంత కాలంగా గమనిస్తే  పనికొచ్చే ప్రశ్నలు మానేసి పనికిరాని ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు.. అనే అభిప్రాయం సామాన్యులకు కూడా కలుగుతుంది. నిజంగా వీళ్ళు జర్నలిస్టు లేనా అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది. ఇప్పటికే జర్నలిజం విలువల్ని తుంగలో తొక్కుతూ కొందరు మీడియా అంటేనే ఇలా తయారయ్యిందా అనేలా మార్చేశారు. ఇక సదరు ప్రెస్ మీట్ లలో అయినా సొంత గొప్పలకు పోవడానికో, ఏదో ఒకరకంగా హైప్ అవ్వడానికి కాకుండా అసలు ఆ సినిమాకు సంబంధించి కొన్ని పనికొచ్చే ప్రశ్నలయిన అడగాలి అని కొందరు సీనియర్ జర్నలిస్ట్ సోదరులకు నెటిజన్లు, సామాన్య ప్రజలు రిక్వస్ట్ చేస్తున్నారు.

గత కొంతకాలంగా ప్రెస్ మీట్ లలో ఎక్కువగా సీనియర్ జర్నలిస్ట్ ఒకరు నోటికి ఏది వస్తే అది అడిగేస్తున్నారు. ఆడగడంలో తప్పులేదు.. ఆడగకపోతేనే తప్పు.. కానీ ఏం అడుగుతున్నాం.. ఎందుకు అడుగుతున్నాం అనే క్లారిటీ ఉండాలి. ఉండకపోతే గట్టిగానే కౌంటర్లు పడతాయి అనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన 2018 సినిమాని తెలుగులో బన్నీ వాసు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విలేఖరులతో ప్రెస్ మీట్ నిర్వహించగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ మేరకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి.. ఈ సినిమా చూసిన తర్వాత మన తెలుగు డైరెక్టర్ ఇలా తీయగలడా? తెలుగు నిర్మాతలు ఇంత సాహసం చేయగలరా? అంటూనే ఓ నిర్మాతగా మీకు ఏ ఫీలింగ్ కలిగింది? అని నిర్మాత బన్నీ వాసును ప్రశ్నించాడు.

అయితే, దీనికి డైరెక్టర్ హరీష్ శంకర్ (Director Harish Shankar) సమాధానమిస్తూ.. ‘నేను ఈ మధ్యన యూట్యూబ్ వీడియోలు చూస్తున్నా. సురేష్ కొండేటి గారు ప్రతి ప్రెస్ మీట్‌లో ఎవ్వరూ అడగని ఒక సాహసోపేతమైన క్వశ్చన్ వేసి, మొత్తం తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయి, దాన్ని యూట్యూబ్‌లో వైరల్ చేసేసుకుని ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇక్కడో సామెత ఉంది. వినేవాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అంట’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.

దీనికి సురేష్ కొండేటి బదులిస్తూ.. అయితే నా ప్రశ్నకు వాసుకు బదులుగా మీరు సమాధానం చెప్పండని అడిగాడు. దీంతో మరోసారి స్టార్ట్ చేసిన హరీష్ శంకర్.. ‘నా సమాధానం ఏంటంటే అసలు ప్రపంచ సినిమా మన చేతిలోకొచ్చిన టెక్నాలజీ ఎరాలో బతుకుతున్నాం. ఇందాక ఫస్ట్ క్వశ్చన్ గురించే నేను మాట్లాడుదాం అనుకున్నాను. కానీ నా సినిమా కాదు ఎందుకులే అనుకున్నా. డబ్బింగ్ సినిమా అంటే.. RRR, బాహుబలి, కేజీఎఫ్‌ను హిందీలో ఎవరైనా డబ్బింగ్ సినిమా అనుకున్నారా? ఇక్కడ డబ్బింగ్ సినిమా, రీమేక్ సినిమా అంటూ ఏం లేవు. సినిమా అంతే. ఏ సినిమా ఎక్కడికైనా వెళ్తుంది. దీనికి సంతోషించాలి. తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీయలేరా? అంటే ఇపుడు ప్రపంచం మొత్తం తెలుగు సినిమాలు చూస్తున్న రోజుల్లో నువ్వు ఇలాంటి క్వశ్చన్ వేశావంటే నిన్ను చూస్తుంటే జాలేస్తుంది సురేష్’ అన్నారు.

అలాగే 2018 డైరెక్టర్ జోసెఫ్ గురించి చెబుతూ.. ‘అతను కేరళ దర్శకుడు అని నేను ఈ సినిమాను చూడలే. తను గొప్ప సినిమా తీశాడని పత్రికా ముఖంగా చెప్పేందుకు వచ్చా’ అన్నారు హరీష్. ఇదే క్రమంలో సురేష్ కొండేటి మధ్యలో కలగజేసుకుంటుంటే వారించిన హరీష్.. ‘నువ్వు క్వశ్చన్ వేయడానికి వచ్చావా? ఆర్గ్యూ చేయడానికి వచ్చావా? ముందు క్లారిటీ ఉండాలి. ఆర్గ్యూ చేయడానికైతే.. అందరినీ కూర్చోబెడదాం. నీ ఓపిక, నేనైతే కదలను ఇక్కడి నుంచి. విషయం ఏంటంటే.. గీతా ఆర్ట్స్ డబ్బింగ్ సినిమాలకే పరిమితం అయిపోతుందా అన్నది సమస్య కాదు. వరుసగా నేనే ఓ వంద డబ్బింగ్ సినిమాలు చేయిస్తా. తప్పేంటి? నాకు తెలియంది ఏంటంటే.. ఒక మంచి సినిమా ఒక ప్లేస్‌లో ఉన్నపుడు ఇంకా పది మందికి చూపించాలనే ప్రయత్నాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి. ఈ సినిమా మీ సినిమా. వాసు ముందుగా ఈ సినిమాను ప్రెస్‌కు చూపిస్తున్నా అన్నాడు. నేను కూడా అదే చెప్పాలనుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్.

 

ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దాన్ని రీ ట్వీట్ చేస్తూ  ‘చులకన వేసే నోరు ఉన్నపుడు.. చురకలు వేసే నోరు కూడా ఉంటుంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు హరీష్. అలాగే ‘ఇండస్ట్రీని ఎవరైనా అవమానిస్తే భరించలేం. దయచేసి పరిశ్రమకు చెందిన ప్రతి ఫిల్మ్ మేకర్‌ను అభినందించండి. కానీ ఈ ముసుగులో మన పరిశ్రమను తక్కువ చేయొద్దు. ప్రపంచం మొత్తం మనవైపు చూస్తోంది’ అంటూ నోట్ కూడా జత చేశాడు. దాంతో ఇప్పటికైనా ఈ ధోరణి మార్చుకోకపోతే ప్రస్తుతానికి అయితే కౌంటర్లతో సమాధానం చెప్పగా.. తర్వాత ఇంకెలా ఉంటుందో వారి విజ్ఞతకు వారు ఆలోచించుకోవాలి అని పలువురు సీనియర్ జర్నలిస్టులు అని అనుకునే వారు గుర్తుంచుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version