Site icon Prime9

Puli Meka: డైరెక్టర్ బాబీ తో పులి మేక టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ.. మీరు చూసేయండి

puli meka

puli meka

Puli Meka:ప్రముఖ దర్శకుడు బాబీతో పులి మేక చిత్ర బృందం చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా బాబీ అడిగిన ప్రశ్నలకు ఈ చిత్ర బృందం (Puli Meka) సరదా సమాధానాలు ఇచ్చింది. మరి బాబీ ఇంకా ఏం ప్రశ్నలు అడిగారో తెలియాలంటే ఈ ఇంటర్య్వూ చూడాల్సిందే.

 

ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ లో ‘పులి మేక’ వెబ్ సీరిస్ ను నిర్మించారు. లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సిరి హన్మంత్, సుమన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా వారితో డైరెక్టర్ బాబీ ప్రత్యేక ఇంటర్య్వూ చేశారు. పోలీస్ అధికారులను వరుస పెట్టి ఓ సీరియల్ కిల్లర్ హతమార్చుతాడు. ఈ పాయింట్ ను బేస్ చేసుకొని వెబ్ సిరీస్ ను రూపొందించారు.

లావణ్య త్రిపాఠి పోలీస్ ఆఫీసర్ పాత్రను చేసింది. సాయికుమార్ తన పాత్రకు చక్కని న్యాయం చేకూర్చాడు. ముక్కు అవినాశ్ తో కలిసి వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాడు. సిరి హన్మంత లేట్ ఎంట్రీ ఇచ్చినా.. ఆమె పాత్రను చక్కగా మలిచారు. రాజా చేంబోలు పాత్రను ఇంకాస్తంత బాగా రాసుకుని ఉండాల్సింది. హీరో తండ్రిగా గోపరాజు రమణ, హీరోయిన్ తండ్రిగా వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్ బాగా నటించారు. ఇతర ప్రధాన పాత్రలను సుమన్, నోయల్, భరణి, మానిక్ రెడ్డి, సమ్మెట గాంధి, వాసు ఇంటూరి, స్పందన పల్లి తదితరులు పోషించారు.

Exit mobile version