Site icon Prime9

Dimple Hayathi : వేణు స్వామితో పూజలు చేయించిన “డింపుల్ హయతి”.. ఆ కారణం తోనే !

dimple hayathi doing pooja with astrologer venu swamy

dimple hayathi doing pooja with astrologer venu swamy

Dimple Hayathi : ప్రముఖ నటి “డింపుల్ హయతి” తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017 వచ్చిన గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హయతి. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్, ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలామందికి డింపుల్ పేరు వినగానే గద్దలకుండా గణేష్ సినిమాలో సూపర్ హిట్ అనే పాట గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక ఇటీవలే ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా పరాజయం పాలవడంతో కొంచెం ఢీలా పడిపోయింది. ప్రస్తుతం గోపీచంద్ సరసన రామబాణం సినిమాలో నటించింది. రిలీజ్ కి రెఢీ గా ఉన్న ఈ మూవీ పైనే అమ్మడు భారీగా ఆశలు పెట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమనులతో టచ్ లో ఉంటూ తన లేటెస్ట్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది.

కాగా ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లోని పలువురు ప్రముఖుల జాతకాలను బయట పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక సినిమాల విషయంలో కూడా ఈయన చెప్పినట్లే జరుగుతుండటం తో ప్రతి ఒక్కరు ఆయన సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. అదే విధంగా పలువురు హీరోయిన్లు కూడా ఆయనతో పూజలు చేయించుకుంటే కేరీర్ సక్సెస్ ఫుల్ గా ఉంటుందని నమ్ముతున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా, నిధి అగర్వాల్ వేణు స్వామితో పూజలు చేయించుకున్న వారి లిస్ట్ లో ఉన్నారు.

ఇప్పుడు తాజాగా డింపుల్ హయాతి (Dimple Hayathi) కూడా ఆ లిస్ట్ లోకి చేరింది. తాజాగా  హైదరాబాద్ లోని తన ఫ్లాట్ లో వేణు స్వామితో రహస్య పూజలు చేయించుకుంది డింపుల్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు కెరీర్ పరంగా మంచి సక్సెస్ లు లేకపోవడం, వ్యక్తిగత జీవితంలో కూడా గత కొంతకాలంలో ఒడిదుడుకులు చోటు చేసుకోవడంతో మళ్లీ పూజలు చేయించినట్లు సమాచారం అందుతుంది.

Exit mobile version