Site icon Prime9

Samantha: ఆరోగ్య సమస్య వల్లే తన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంటు సమంత ఆవేదన …

details about samantha health issue

details about samantha health issue

Samantha:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. తాను మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్నానని కొన్ని రోజుల క్రితం సమంత సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన . అయితే ప్రస్తుతం ఆమె మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశాల్లో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆమె భూటాన్ లో హాట్ స్టోన్ బాత్ అనే ఆయుర్వేదిక్ చికిత్స తీసుకుంటున్నారు. రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ఈ చికిత్సను తీసుకుంటారు. మరోవైపు తాజగా హార్పర్స్ బజార్ అనే అనే మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను పంచుకున్నారు.

తాను ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నానని… అదే సమయంలో తన వైవాహిక జీవితం ముగిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం దెబ్బతినడం తన పని మీద ప్రభావం చూపిందని చెప్పారు.తన ఆరోగ్య సమస్య వల్లే తన పని పైన ఎక్కువ శ్రద్ధ పెట్టకపోయినట్టు దీని కారణంగానే తన సినిమాలు ఫ్లాప్ అయ్యాయని తెలిపారు. ఇవన్నీ తన జీవితంలో బాధాకరమైనవని చెప్పారు. పలు సమస్యలు తనను ఒక్కసారిగా చుట్టుముట్టాయని తెలిపారు.

‘‘జీవితంలో కొన్ని మంచి రోజులు ఉంటాయి.. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయని నా సోషల్ మీడియా పోస్టులో నేను చెప్పాను. ఇంకొక్క అడుగు ముందుకు వేయలేనేమో అనిపించింది. కానీ, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక్కడి వరకు వచ్చానా అనిపిస్తుంది. నేను ఇలాగే పోరాడతా. నాలానే చాలా మంది పోరాడుతున్నారు. ఈ పోరాటంలో మేం గెలుస్తాం’’ అని వణుకుతున్న గొంతుతో మాట్లాడుతూ సమంత కంటతడి పెట్టుకున్నారు. ఈ సమయంలో తన అరోగ్యం గురించి ఆమె ఒక విషయం స్పష్టం చేశారు.

ఒకవైపు అనారోగ్య సమస్యలు, మరోవైపు మానసిక సంఘర్షణకు గురవుతున్న సమయంలో… ఆరోగ్య సమస్యలకు గురైన వారి గురించి, ట్రోలింగ్స్ గురించి ఆందోళనకు గురైన వారి గురించిన కథనాలను చదివానని చెప్పారు. వాళ్లు ఇబ్బందుల నుంచి బయటపడిన కథనాలు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని తెలిపారు. తన శక్తి మేరకు తాను పోరాడుతున్నానని.. ప్రతి ఒక్కరికి ఇలాంటి సమయంలో పోరాడే శక్తి ఉంటుందని తాను భావిస్తున్నానని చెప్పారు.

Exit mobile version